
వ్యాపారిపై చర్య తీసుకోవాలి
నర్సంపేట రూరల్: మొక్కజొన్న పంటను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్లపైడి, అధ్యక్షుడు బుర్ర ఆనంద్ డిమాండ్ చేశారు. బుధవారం భాంజీపేట గ్రామానికి చెందిన రైతు పిట్టల మల్లయ్యతో వారు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘనాయకులు మాట్లాడుతూ చంద్రయ్యపల్లి గ్రామానికి ఓ ఫర్టిలైజర్ వ్యాపారి వద్ద నాలుగు సంవత్సరాలుగా మల్లయ్య పురుగుల మందులు తీసుకొచ్చి పంటలకు స్ప్రే చేస్తున్నాడు. దీంతో ఆయన రూ.20 వేలు సదరు వ్యాపారికి చెల్లించాల్సి ఉంది. కొంతమందిని తీసుకొచ్చి కల్లం వద్ద ఆరబెట్టిన మొక్కజొన్న పంటను వ్యాపారి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా మల్లయ్య అడ్డుకున్నాడు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు. తక్షణమే వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాస్‌లైన్ రైతు కూలీ సంఘం డివిజన్ నాయకులు అడ్డూరి రాజు, తెలంగాణ రైతుకూలీ సంఘం నాయకులు భూమా అశోక్, ఈరెల్లి రాంచందర్, శివరాత్రి కుమారస్వామి, ఎలకంటి కుమారస్వామి, ఓదెల రాజయ్య, లింగయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
రైతు సంఘం రాష్ట్ర
కన్వీనర్ సోమిడి శ్రీనివాస్