
ఆరబోసి.. ఆగం చేసి
రోడ్డును కల్లాలు చేస్తున్నారు. ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారకులవుతున్నారు ఐనవో లు మండలంలోని కొంతమంది రైతులు. ఐనవోలు నుంచి వనమాల కనపర్తి వరకు ఉన్న రోడ్డు సగాన్ని ఆక్రమించి మక్కలు ఆరబోస్తున్నారు. దీంతో ఈ దారిగుండా ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా రు. వివిధ ప్రాంతాల నుంచి ఐనవోలు ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కువగా ఈ దారి మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. ఈక్రమంలో రోడ్డులో సగభాగం మక్కలు ఆరబోసి ఉండడంతో ఎదురుగా వాహనాలు వస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది అదుపుతప్పి గాయాలపాలయ్యారు. పెద్ద ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవా లని, ప్రభుత్వం కల్లాలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
– ఐనవోలు

ఆరబోసి.. ఆగం చేసి