
ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు
వరంగల్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, హార్వెస్టింగ్ యజమానులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సీజన్‌లో సుమారు 2.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసి, జిల్లా వ్యాప్తంగా సుమారు 182 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా రవాణా అధికారి శోభన్‌బాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, ఏఓలు, ఏఈఓలు, హార్వెస్టర్ల యజమానులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద