
అంతర్గత పనులు త్వరగా పూర్తి చేయాలి
హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీందర్‌నాయక్
కమలాపూర్: డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద చేపట్టిన అంతర్గత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీందర్‌నాయక్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కమలాపూర్‌లో నిర్మించిన, నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను, అక్కడ జరుగుతున్న అంతర్గత పనుల్ని పరిశీలించారు. ఇక్కడ ఇప్పటి వరకు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఎన్ని, ఇంకా నిర్మాణంలో ఉన్న ఇళ్లు ఎన్ని? అని అడిగి తెలుసుకుని ఆ ఇళ్ల స్థితిగతులను, నాణ్యతను పరిశీలించారు. డబుల్ బెడ్రూంల వద్ద చేపట్టిన డ్రెయినేజీ, సీసీ రోడ్ల వంటి అంతర్గత పనుల్లో వేగం పెంచాలని అధికారులతో పాటు సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈ సిద్ధార్థనాయక్, ఏఈ నరేందర్ రాజు పాల్గొన్నారు.