
– ఖిలా వరంగల్
● తిన్నంత బిర్యానీ.. వచ్చి తినిపో.. ● ఇలాంటి కొత్త పేర్లు, వైరెటీ కాన్సెప్టులెన్నో..
ఆకలి రాజ్యం.. చిల్ మామా.. తిన్నంత భోజనం.. స్మోకీ డోకీ.. పొట్లం బిర్యానీ.. ఫుడ్ ఆన్‌ఫైర్.. ప్రకృతి... కడాయి.. రెడ్ బస్.. హంగర్ స్ట్రీట్.. ఇలా ఎన్నో పేర్లు. ట్రేన్.. జైలు, అరణ్యం ఇలా ఎన్నో థీమ్‌లు. గ్రేటర్ వరంగల్ నగరంలో కొత్త కాన్సెప్టులు, నోరూరించే రుచులతో రెస్టారెంట్లు భోజనప్రియులను ఆకర్షిస్తున్నాయి. వైరెటీ వంటకాలతో రారమ్మని పిలుస్తున్నాయి. వాటిపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.
ఒక్క క్లిక్‌తో ఇంటికే..
ఒక్క క్లిక్‌తో వేళాపాళా లేకుండా ఇంటికే భోజనం వచ్చేస్తుంది. అది కూడా నిమిషాల్లో. కొన్ని యాప్‌లు అయితే ఉచిత డెలివరీ ఆప్షన్లు ఇస్తున్నాయి. మరికొన్ని యాప్‌లకు నెలవారీగా, మూడు నెలలకు, ఏడాదికి సబ్‌స్క్రిప్షన్ చెల్లిస్తే చాలు పూర్తి స్థాయి ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తావా.. బుక్ చెయ్. మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఇలా.. నోటిఫికేషన్లనూ పంపిస్తూ ఇంటి వద్దకే సేవలందిస్తున్నాయి.