
ఘనంగా హనుమత్ విజయోత్సవం
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శనివారం చైత్రమాసం పౌర్ణమి తిథిని పురస్కరించుకుని హనుమత్ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నాట్యమండపంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని పంచలోహ పంచముఖ మహా హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్, సిబ్బంది మధుకర్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో హనుమన్ భక్తులు, సందర్శకులు పాల్గొన్నారు.
సవాళ్లను అధిగమించాలి..
కేయూ క్యాంపస్: ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార నిర్వహణ విద్య అనేక సమస్యల్ని, సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటోందని వాటిని నైపుణ్యాలతో అధిగమించాలని సౌత్ ఆఫ్రికా దర్బన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రేనా అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలో డైరెక్టర్, పాలక మండలి సభ్యుడు బి.సురేశ్‌లాల్ అధ్యక్షతన నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో ఆయన వ్యాపార నిర్వహణ విద్యపై విస్తృతోపన్యాసం చేశారు. మేనేజ్‌మెంట్ విద్యతో బాధ్యతాయుతమైన నాయకులను తయారు చేయడం లక్ష్యమన్నారు. సంప్రదాయ మార్కెటింగ్, ఫైనాన్స్ మానవ వనరులకు మించిన క్రియాత్మక రంగాలపై విస్తృత అ వగాహన అవసరముందన్నారు. సమావేశంలో అధ్యాపకులు వీణ, సుమలత పాల్గొన్నారు.
నకిలీ వైద్యుడిపై కేసు
ఎంజీఎం: వరంగల్ కాశిబుగ్గలోని సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడు జి.సదానందంపై కేసు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు శనివారం తెలిపారు. అశాసీ్త్రయ పద్ధతిలో హై డోస్ యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు ఫార్మసీ లైసెన్స్ లేకుండా పెద్ద మొత్తంలో నిల్వ ఉంచినట్లు సభ్యులు గుర్తించారు. ఇంతేజార్ గంజ్ పోలీస్‌స్టేషన్‌లో రిజిస్టర్డ్ డాక్టర్ డి.లాలయ్య కుమార్, చైర్మన్ డాక్టర్ మహేశ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్‌ఎంసీ చట్టం సెక్షన్ 34, 54, టీఎస్‌ఎంపీఆర్ చట్టం సెక్షన్ 22 ప్రకారం.. ఈకేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం నకిలీ వైద్యుడికి జైలు శిక్ష రూ.5 లక్షలు జరిమానా విధించే అవకాశం ఉందని కౌన్సిల్ సభ్యులు నరేశ్ పేర్కొన్నారు.

ఘనంగా హనుమత్ విజయోత్సవం

ఘనంగా హనుమత్ విజయోత్సవం