
మృత పిండం అప్పగింత
ఎంజీఎం: నగరంలోని రైల్వే గేట్ సమీపంలో కేవీఎన్ రెసిడెన్సీ నివాసి అయిన భావన తన గర్భంలో పెరుగుతున్న 6 నెలల పిండంలో ప్రమాదకరమైన వ్యాధిని గుర్తించిన వైద్యులు తల్లికి ఆపాయం జరుగుతుందని పిండాన్ని తొలగించారు. తల్లిదండ్రులు సమాజ హితం కోరి కేఎంసీ వైద్య విద్యకు దానం చేయడానికి ముందుకు రాగా, తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి ఆదేశంతో కళాశాల అనాటమీ విభాగానికి మృత పిండాన్ని అప్పగించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు మునిగాల పద్మ, వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు మల్లారెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.