
కిలోమీటరు నడవాల్సిందే..
నెక్కొండ: ఓవైపు మండుతున్న ఎండలతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కష్టాలు వర్ణనాతీతం. నెక్కొండ మండల కేంద్రంలోని హైస్కూల్ సెంటర్, తెలంగాణ తల్లి సెంటర్‌లో ఆర్టీసీ బస్‌షెల్టర్లు లేవు. వరంగల్, మహబూబాబాద్ ఆర్టీసీ డిపో బస్సులు నెక్కొండ బస్టాండ్‌కు వెళ్లడం లేదు. అక్కడి నుంచి కిలోమీటరు దూరం నడుచుకుంటూ ఆయా సెంటర్లకు వెళ్లాల్సిన దుస్థితి ఉంటుంది. ఇక్కడ తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్ల సదుపాయాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలో ప్రయాణికులు నీడ కోసం షాపుల ముందు కూర్చొని గంటలపాటు బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.