కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ మునిసిపల్ కార్మికులు తాడేపల్లిగూడెంలో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అప్కాస్ రద్దు చేస్తారన్న వార్తల నేపథ్యంలో పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. అన్ని విభాగాల కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అప్కాస్ రద్దు చేసే ముందు కార్మిక సంఘాలతో చర్చించాలని, సిబ్బంది సంఖ్యను, వాహనాల సంఖ్యను పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం అందజేయాలని నినాదాలు చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్, ఏరియా కార్యదర్శి మందలపర్తి హరీష్, నాయకులు తాడికొండ శ్రీనివాస్, అల్లం కుమార్‌స్వామి, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment