
భీమేశ్వరస్వామి రథోత్సవం
భీమవరం(ప్రకాశం చౌక్): పట్టణంలోని భీమేశ్వరస్వామి దేవస్థానంలోని స్వామి రథోత్సవం గురువారం నేత్రపర్వంగా సాగింది. ముందుగా రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి విశేష పూజలు చేశారు. భక్త జనసందోహం మధ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి తోట శ్రీనివాస్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా రామలింగేశ్వరుని రథోత్సవం
భీమవరం అర్బన్: మండలంలోని దిరుసుమర్రు గ్రామంలో మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామలింగేశ్వరస్వామి రథోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ అర్చకులు స్వామివార్లకు పంచామృత అభిషేకాలు, సహస్రనామార్చనలు, గో క్షీరాభిషేకాలతో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన రథోత్సవంలో దేవతా మూర్తులను ప్రతిష్టించి పుర వీధుల్లో రథోత్సవాన్ని నిర్వహించారు. సర్పంచ్ కోళ్ల బాలకృష్ణ స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి బంగార్రాజు, కలిదిండి పేర్రాజు, మైగాపుల గంగారామ్, ఇళ్ల బాబు, నక్కా రామోజీ, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment