
శరవేగంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే మండలాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, వ్యాపార షాపుల్లో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఈ ప్రక్రియ పూర్తి కావస్తోందని అధికారులు చెబుతున్నారు. తదుపరి గృహాలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రభుత్వ వాటర్ ట్యాంక్‌లు, సచివాలయాలు, వీధిలైట్లకు కూడా ఈ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. స్మార్ట్ మీటర్ల విధానంలో ఇకపై రీచార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. రీచార్జ్ చేస్తేనే విద్యుత్ సరఫరా కొనసాగుతుంది. బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే రీచార్జ్ చేసుకోవాలి. లేకుంటే చీకట్లో మగ్గాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment