
రోడ్డు ప్రమాదంలో పూళ్ల యువకుడు మృతి
ఉంగుటూరు: మండలంలోని కై కరం బీసీ కాలనీ ప్రాంతం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పూళ్లకు చెందిన ఛాబత్తిన తులసీరామ్ (20) ఐస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి నారాయణపురం వద్ద హోటల్‌లో ఫ్రైడ్ రైస్ కట్టించుకొని బైక్‌పై తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదస్థలిలో అతని తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగిందా లేక ఆగివున్న ఢీకొనడం వల్ల ప్రమాదానికి గురయ్యాడా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికీ అతను మృతిచెంది ఉండటంతో ఏమీ చేయలేకపోయారు. చేబ్రోలు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment