
నేత్ర పర్వంగా శాంతి కల్యాణం
ద్వారకాతిరుమల: అతిరుద్ర ప్రయోగ సహిత మహా సుదర్శన నృసింహ 31వ మహా యజ్ఞం ముగింపును పురస్కరించుకుని గురువారం సుందరగిరిపై ముగ్గురు దేవతామూర్తులకు వారి దేవేరులతో శాంతి కల్యాణ మహోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీకనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణములో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత నరసింహస్వామి వారికి, శివ పార్వతులకు, లక్ష్మీ నారాయణులకు అంగరంగ వైభవంగా కల్యాణం నిర్వహించారు. రుత్వికులు, పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కల్యాణ తంతును వీక్షించిన భక్తజనులు పరవశించారు. బుధవారం సాయంత్రం ప్రారంభమైన మహా యజ్ఞంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment