
ప్రతి శనివారం ఆశ్రంకు ఉచిత బస్సు
దెందులూరు: అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజీ (ఆశ్రం) ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉదయం 8 గంటలకు జంగారెడ్డిగూడెం నుంచి ఆశ్రంకు ఉచిత బస్సు సర్వీసు నడుపుతున్నట్టు ఆసుపత్రి పీఆర్‌ఓ ప్రసాద్ తెలిపారు. అస్సారావుపేట రోడ్డు హైస్కూల్ నుంచి జంగారెడ్డిగూడెం బస్టాండ్, ఆటోనగర్, గురవాయిగూడెం, దేవులపల్లి అడ్డరోడ్డు, ఆడమిల్లి, కామవరపుకోట, ద్వారకాతిరుమల అడ్డరోడ్డు, తడికలపూడి, వేగివాడ, కన్నాపురం అడ్డరోడ్డు, చక్రాయగూడెం, మొండూరు, అక్కిరెడ్డిగూడెం, గంగన్నగూడెం, గాలాయగూడెం, గోపన్నపాలెం, సోమవరప్పాడు గ్రామాల మీదుగా ఆశ్రం ఆస్పత్రికి ఉచితంగా రోగుల సౌకర్యార్థం బస్సు సర్వీసు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆసుపత్రి ఆధ్వర్యంలో అత్యంత నాణ్యమైన తక్కువ ధరకే నైపుణ్యం గల డాక్టర్లతో వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment