కూటమి.. సూపర్‌ దగా | - | Sakshi
Sakshi News home page

కూటమి.. సూపర్‌ దగా

Published Sat, Mar 1 2025 7:33 AM | Last Updated on Sat, Mar 1 2025 7:32 AM

కూటమి

కూటమి.. సూపర్‌ దగా

నేటి నుంచి కొల్లేటికోటలో జాతర
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర, కలిదిండి మరియమాత మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. సీఐ వి.రవికుమార్‌ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025

రాష్ట్ర బడ్జెట్‌లో సూపర్‌ సిక్స్‌ హామీల అమలుకోసం గంపెడాశతో ఎదురుచూస్తున్న పేదవర్గాల వారికి కూటమి ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపింది. మూడు ప్రధాన హామీల ప్రస్తావనే లేకపోగా, మరో మూడింటికి భారీగా కోత పెడుతూ అరకొర కేటాయింపులు చేసింది. డ్వాక్రా మహిళలకు టోకరా వేసింది. కూటమి వంచనపై పేదలు పెదవి విరుస్తున్నారు.

నిరుద్యోగులకు అందని భృతి

జిల్లాలో కుటుంబాలు 5.17 లక్షలు

రూ.3 వేల ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు

సంక్షేమం విడిచి.. హామీలు విస్మరించి..

బడ్జెట్‌లో ఎన్నికల హామీలను గాలికొదిలేసిన సర్కారు

ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సుకు కేటాయింపులు నిల్‌

దీపం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనంకు అరకొరగానే..

డ్వాక్రా మహిళలకు మొండిచేయి కూటమి బడ్జెట్‌పై పేదల పెదవి విరుపు

అన్నదాతకు లేదు భరోసా

జిల్లాలో సాగు భూమి 2.3 లక్షల ఎకరాలు

రైతులు 1,24,645 మంది

అన్నదాత సుఖీభవ అందక రైతులు నష్టపోయిన సాయం రూ.249.29 కోట్లు

సాక్షి, భీమవరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా గతేడాది ఏప్రిల్‌ 5న నరసాపురం, పాలకొల్లు, ఏప్రిల్‌ 10న తణుకు, ఏప్రిల్‌ 21న నరసాపురం, భీమవరం, ఏప్రిల్‌ 29న తాడేపల్లిగూడెం, మే 10న ఉండి బహిరంగ సభల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు సూపర్‌ సిక్స్‌ హామీలను ఊదరగొట్టారు. పాలనలోకి వచ్చిన మొదటి నెల నుంచే హామీలను అమలు చేస్తామన్నారు. తల్లికి వందనంగా ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఎందరుంటే అంతమందికి ఇస్తామన్నారు. రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం చేస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, ఆడబిడ్డ నిధిగా 18 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1,500లు ఇస్తామన్నారు. ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు గ్యాస్‌ సిలెండర్లు ఉచితమన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా ఒక్క హామీని అమలుచేయలేదు. పాలన చేపట్టాకా రూ.1.45 లక్షల కోట్ల వరకు అప్పులు తెచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయినీ ఆయా సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించలేదు.

కేటాయింపులు నిల్‌

శుక్రవారం శాసనసభలో చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి, ఉచిత బస్సు హామీల ప్రస్తావనే లేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు అరకొర కేటాయింపులు చేశారు. గతంలోనూ తల్లికి వందనంకు కేటాయింపులు చేసినా అమలుచేయలేదు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పినా బడ్జెట్‌లో ఊసే లేదు.

ఉద్యోగులకు నిరాశ

భీమవరం (ప్రకాశంచౌక్‌): రాష్ట్ర బడ్జెట్‌లో 12వ పీఆర్సీకి నిధులు కేటాయిస్తారని ఆశతో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరాశకు గురయ్యారని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి జి.ప్రకాశం, బీవీ నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా పీఆర్సీకి నిధులు కేటాయించకపోవడం, ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయి పడ్డ రూ.25 వేల కోట్ల ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం దారుణమని విమర్శించారు.

హుండీ ఆదాయం లెక్కింపు

కై కలూరు: కలిదిండి పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామి ఆలయానికి శివరాత్రి ఉత్సవాల్లో హుండీల ఆదాయం, చదివింపుల రూపంలో రూ.27,44,437 సమకూరింది.

తల్లికి ఎగనామం

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, ఇంటర్‌ విద్యార్థులు : 2,49,662

అర్హులైన విద్యార్థులు (70 శాతం) సుమారు 1,74,763

తల్లికి వందనంగా ఈ విద్యా సంవత్సరంలో తల్లులు నష్టపోయిన మొత్తం రూ.262.14 కోట్లు

న్యూస్‌రీల్‌

ఒక్కటే సిలిండర్‌

మొత్తం రేషన్‌కార్డులు 5,67,651

ఒక్కో కార్డుపై ఏడాదికి మూడు చొప్పున ఇవ్వాల్సిన సిలెండర్లు 17,02,953

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో

ఇస్తున్న సిలెండర్లు 5,67,651

లబ్ధిదారులు కోల్పోయిన సిలెండర్లు 11,35,302

పేదలు నష్టపోయిన మొత్తం రూ.93.94 కోట్లు

ఆడబిడ్డకు అన్యాయం

మహిళలకు ప్రతి నెలా రూ.1,500

జిల్లాలో 18 ఏళ్లు నిండిన మహిళలు 7,51,313

సామాజిక పింఛన్లు పొందుతున్న మహిళలు 1.55 లక్షలు

రూ.1,500 పొందేందుకు అర్హులు 5,96,313

ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా మహిళలు నష్టపోతున్న మొత్తం రూ.89.45 కోట్లు

ఉచిత బస్సు.. తుస్సు

జిల్లాలో జనాభా : 19,00,228

పురుషులు : 9,48,461

మహిళలు: 9,51,766

ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాల్సి ఉంది

No comments yet. Be the first to comment!
Add a comment
కూటమి.. సూపర్‌ దగా 1
1/2

కూటమి.. సూపర్‌ దగా

కూటమి.. సూపర్‌ దగా 2
2/2

కూటమి.. సూపర్‌ దగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement