పైడిపర్రులో భారీ చోరీ
39 కాసుల బంగారం, రూ.40 వేల నగదు అపహరణ
తణుకు అర్బన్: ఇంట్లో ఉండగానే.. బీరువా తలు పులు తెరిచి చోరీ చేసిన ఘటన తణుకు శివారు పైడిపర్రులో జరిగింది. శుక్రవారం వేకువజామున 4 గంటల సమయంలో జరిగిన ఈ చోరీలో 39 కాసు ల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ.40 వేల నగదు దొంగలు దోచుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. తణుకు మండలం పైడిపర్రులో నివసిస్తున్న తాటికాయల వెంకటేశ్వరరావు శుక్రవారం వేకువజామున లేచి బాత్రూంలోకి వెళ్లారు. ఇంటి తలుపులు దగ్గరకు వేసి వెళ్లడంతో లోపలకు ప్రవేశించిన దొంగలు బీరువా తెరిచి బంగారు ఆభరణా లు, నగదు దోచుకెళ్లారు. బీరువా పక్కనే మంచంపై నిద్రిస్తున్న భార్య వీరవేణికి లైటు వెలుగు పడగానే మెలకువ వచ్చినా తన భర్త అనుకుని పక్కకు తిరిగి పడుకున్నారు. ఇదే అదనుగా దొంగ తన పని తాను చేసుకుని వెళ్లాడు. కొద్దిసేపటికి లోనికి వచ్చిన వెంకటేశ్వరరావు బీరువా తెరచి ఉండడాన్ని చూసి కేకలు వేశారు. ఇంటి ఆవరణలోని అరుగుపై తచ్చాడుతు న్న దొంగను చూసి బిగ్గరగా అరవడంతో పారిపోయిన దొంగ కొద్ది దూరంలో ద్విచక్రవాహనంపై వేచిఉన్న మరో వ్యక్తితో కలిసి ఉడాయించాడు. రోజూ ఉదయం 4 గంటలకు యజమాని నిద్రలేచి బయటకు వస్తారని తెలిసే దొంగలు వచ్చారని, ఈ ప్రాంతానికి చెందిన వారే అయిఉంటారని పోలీసు లు భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్, సీఐలు బి.కృష్ణకుమార్, ఎన్.కొండయ్య, ఎస్సైలు చంద్రశేఖర్, ట్రాఫిక్ ఎస్సై డి.ఆదినారాయణ, పోలీసులు ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ఇటీ వల పైడిపర్రు ప్రాంతం వరుస దొంగతనాలతో అ ట్టుడుకుతోంది. ఈనెల 17న 6 ఇళ్లలో దొంగలు స్వై రవిహారం చేశారు. ఈ దొంగతనాలన్నీ తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరగడం విశేషం. వరుస ఘటనలు జరుగుతున్నా పోలీసులు తగు చర్యలు తీసుకోవడం లేదని, రాత్రి బీట్‌లు సరిగా నిర్వహించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment