ఏలూరు (టూటౌన్): ఐఆర్‌టీసీ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 29 వరకు జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర పేరుతో రైల్ టూర్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ మార్కెటింగ్ మేనేజర్ ఎం.రాజా శనివారం ప్రకటనలో తెలియజేశారు. ఈ యాత్రలో అరుణాచలం – రామేశ్వరం – మధురై – కన్యాకుమారి – త్రివేండ్రమ్ – త్రిచీ – తంజావూరు సందర్శించే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు విజయవాడ, తెనాలి, చీరాల,ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు స్టేషన్‌లలో ఆగుతుందన్నారు. టికెట్ వెల స్లీపర్ క్లాస్ రూ. 14,250. థర్డ్ ఏసీ రూ.21,880, సెకండ్ ఏసీ రూ.28,440గా ఉందన్నారు. వివరాలకు సెల్ నెం.92814 95848లో సంపద్రించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment