గురుకులం.. పేద విద్యారు్థలకు వరం
భీమడోలు: 2025–26 విద్యా సంవత్సరానికి బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరేందుకు గురుకులాల సొసైటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 6 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. గురుకులాల్లో శారీరక, మానసిక ఉల్లాసం కోసం క్రీడలు, యోగా, ధాన్యం వంటి వాటిలో శిక్షణ అందిస్తారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం ఇస్తారు. ఉపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణలో నాణ్యమైన విద్యా బోధన అందిస్తారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. ఐదో తరగతిలో చేరికకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2012 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య జన్మించాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 2014 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్ట్ 31 మధ్య పుట్టి ఉండాలి. జూనియర్ ఇంటర్‌లో చేరికకు 2024–25 ఏడాదిలో పదో తరగతి పరీక్షకు హజరవుతున్న విద్యార్థులు అర్హులు. ఐదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు విద్యార్థి తల్లిదండ్రులకు ఏడాది ఆదాయం రూ.లక్షకు మించరాదు. ఒక్కో పాఠశాలలో ఐదో తరగతికి 80 సీట్లు, జూనియర్ ఇంటర్‌కు 80 సీట్లు ఉంటాయి.
దరఖాస్తుకు ఇవి తప్పనిసరి : విద్యార్థి వివరాలు తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలి. నమోదు సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఫొటోలు, తెల్లరేషన్ కార్డు, పూర్వ తరగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇంటర్ ప్రవేశానికి అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుంది.
పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి
● ఏలూరు జిల్లాలో బాలురుకు పెదవేగి, చింతలపూడి, బాలికలకు పోలసానిపల్లి, వట్లూరు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, నూజవీడులో పాఠశాలలున్నాయి.
● పశ్చిమగోదావరి జిల్లాలో బాలురకు ఆరు గొలను, న్యూ ఆరుగొలను, ఎల్‌బీ చర్ల(నరసాపురం), బాలికలకు పెనుగొండలో పాఠశాల ఉంది.
కళాశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి
● ఏలూరు జిల్లాలో బాలురకు పెదవేగిలో, బాలికలకు పోలసానిపల్లి, వట్లూరు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, నూజివీడులో కళాశాలలున్నాయి ఉన్నాయి.
● పశ్చిమగోదావరి జిల్లాలో బాలురకు ఆరుగొలను, ఎల్‌బీ చర్ల(నరసాపురం)లో కళాశాలలున్నాయి. జంగారెడ్డిగూడెం మినహా ఇతర కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీకి 40 సీట్ల చొప్పున 80 సీట్లు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం బాలికల కళాశాలలో ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయి. ద్వారకాతిరుమల బాలికల కళాశాలలో ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్ పరీక్షకు తగిన శిక్షణ ఇస్తారు.
దరఖాస్తులకు ఈ నెల 6 వరకు గడువు
ప్రతిభ ఆధారంగా సీట్లు
ఏటా ఐదో తరగతి, జూనియర్ ఇంటర్‌లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. బయట దరఖాస్తు చేయించుకుంటే డబ్బులు చెల్లించాలి. మీ సమీపంలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు నాలుగో తరగతి సిలబస్ వరకు చదువుకోవాలి. ఇంటర్ వారికి పదో తరగతి వరకు సిలబస్ చదవాలి.
– బి.ఉమాకుమారి, డీసీవో, ఏలూరు
గురుకులం.. పేద విద్యారు్థలకు వరం
Comments
Please login to add a commentAdd a comment