
పోలవరం ప్రాజెక్టు పరిశీలన
పోలవరం రూరల్: హైదరాబాద్‌లో అటవీ శాఖలో శిక్షణ పొందుతున్న అధికారులు శిక్షణలో భాగంగా పోలవరం ప్రాంతంలోని అటవీ ప్రాంతాన్ని, ప్రాజెక్టును శనివారం పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు తీరు, వివరాలు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.
ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ
ఏలూరు(మెట్రో): ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ఆన్‌లైన్ శిక్షణ అందించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మార్చి 3న ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం నిర్వహించిన ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు.
జాతీయ సదస్సుకు మహదేవపట్నం సర్పంచ్
ఉండి: జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్క రించుకుని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్వ హించే వర్క్‌షాపునకు జిల్లా నుంచి ఉండి మండలం మహదేవపట్నం సర్పంచ్ వనిమా నాగ వెంకట సుబ్బల క్ష్మి ఎంపికయ్యారు. ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సుకు ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. సాధికారితపై తన అభిప్రాయాలను ఢిల్లీ వేదికగా వినిపిస్తానన్నారు. రాష్ట్రం నుంచి ఈ కార్యక్రమానికి ఎంపికై న 12 మంది సర్పంచుల్లో తాను ఉన్నానని, ఈ గుర్తింపు లభించడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఇదంతా మహదేవపట్నం ప్రజలు తనకు కల్పించిన కానుకని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆమె తెలిపారు. 3న ఢిల్లీకి ప్రయాణమవుతున్నామని ఆమె తెలిపారు.
రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా క్రిమినల్ చట్టాలు
భీమవరం (ప్రకాశంచౌక్): ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జిల్లా సమావేశం భీమవరం అంబేడ్కర్ భవనంలో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఎల్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు జి.శాంతకుమార్ మాట్లాడుతూ నూతన క్రిమినల్ చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టాలని చూస్తున్న అడ్వకేట్ అమెండ్‌మెంట్ యాక్ట్ న్యాయవాద హక్కులను కాలరాసేలా ఉందన్నారు. సమావేశంలో శీలం విజయ్‌కుమార్, ఇంజేటి జాన్ కెనడీ తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారత వారోత్సవాలు
భీమవరం (ప్రకాశంచౌక్): మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రత, రక్షణ కోసం మహిళా సాధికారత వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థినులు, మహిళలకు విధి నిర్వ హణలో పోలీసులు వినియోగించే పరికరాలు, ఆయుధాల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందిస్తామన్నారు. విద్యార్థినులకు వ్యాస రచన పోటీలు, వక్తృత్వ, చిత్ర లేఖనం పోటీలు నిర్వహిస్తామన్నారు.
బ్లాక్‌లిస్టులో పని చేయని కాంట్రాక్టర్లు: కలెక్టర్
దెందులూరు: నిర్దేశించిన సమయంలోగా ఇరిగేషన్ కాలువలు, చెరువుల్లో గుర్రపు డెక్క, తూడు, పూడికతీత పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. దెందులూరు మండలం సత్యనారాయణపురం, శింగవరం, గుండుగొలను తదితర ప్రాంతాలలోని ఇరిగేషన్ కాలువలు, చెరువులను శనివారం కలెక్టర్ పరిశీలించారు. నిధుల కొరత లేదని, గురప్రు డెక్క, తూడు, పూడికతీత పనులు చేయని కారణంగా సాగు, తాగునీటి సమస్య తలెత్తిందన్న ఫిర్యాదు అందితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ పీ నాగార్జునరావు, ఆర్‌డీఓ అచ్యుత్ అంబరీష్ తదితరులు పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్టు పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment