
ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం పట్టణంలోని శ్రీ వాసవి గ్రంధి మాణిక్యాలరావు జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతి క్లాస్ రూంకి వెళ్లి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎవరికై నా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే ఫస్ట్ ఎయిడ్‌కు సిద్ధంగా ఉండాలని వైద్య శాఖ సిబ్బందికి సూచించారు. ఇంటర్ మొదటి సంవత్సరం 19,708 మంది, రెండో సంవత్సరం 18,123 మంది విద్యార్థులు పరీక్షలకు హజరవుతున్నారని వెల్లడించారు. ప్రశ్నాపత్రాలు భద్రపరిచేందుకు జిల్లాలో 13 స్టోరేజ్ పాయింట్లు, మూడు ఫ్లెయింగ్ స్క్వాడ్లు, మూడు సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణలో సమస్యలు వస్తే కంట్రోల్ రూమ్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలను పూర్తి చేయడానికి అధికారులు కృషి చేయాలని తెలిపారు.
పది పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పక్కా ప్రణాళికలు రూపొందించుకుని మంచి ఫలితాలు సాధించాలని కలెక్టరు చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగు కాలేజీలో ఏర్పాటు చేసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ శిక్షణ తరగతుల్లో ముఖ్య అతిథిగా కలెక్టరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో 128 కేంద్రాల్లో 24,393 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఎలాంటి చిన్న సమస్య వచ్చినా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిశీలించుకోవాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, రక్షిత తాగునీరు అందించాలన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment