మామిడిశెట్టి రామాంజనేయులు, కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆహార ధాన్యాలు పండిస్తున్న కౌలు రైతులను పూర్తిగా విస్మరించారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ విమర్శించింది. ఈ సందర్భంగా కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ కౌలు రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక కేటాయింపులేవీ చేయకుండా వ్యవసాయంలో వృద్ధి సాధించడం ఎలా సాధ్యమన్నారు. కొత్త కౌలు చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టంగా చెప్పలేదన్నారు. కౌలు రైతులకు ప్రత్యేకంగా బ్యాంకు రుణాల కేటాయింపు లేదన్నారు. పంటల బీమాకు కేవలం రూ.1,023 కోట్లు కేటాయించిన ప్రభుత్వం పంట నష్టం, విపత్తుల నిధి వంటివి పట్టించుకోలేదన్నారు. జిల్లాలో కాలువల ఆధునికీకరణకు అధికారులు సుమారు రూ.50 కోట్ల వరకు ప్రతిపాదనలు పంపారని, బడ్జెట్‌లో డెల్టా ఆధునికీకరణకు కేవలం రూ.11 కోట్లు కేటాయించారని తెలిపారు. తక్షణం కాలువల ఆధునికీకరణకు రూ.100 కోట్లు, కౌలు రైతుల పంట రుణాలకు రూ.500 కోట్లు కేటాయించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment