కూటమి బడ్జెట్‌తో విద్యా రంగం కుదేలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌తో విద్యారంగం కుదేలైందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో కేటాయించిన నిధులు విద్యారంగ అభివృద్ధికి అరకొరగా మాత్రమే పనికొస్తాయన్నారు. గత ప్రభుత్వం పాఠశాలల కోసం నాడు – నేడు పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో పాఠశాలల అభివృద్ధి ఊసెత్తలేదన్నారు. ఉన్నత విద్యకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు. ఉపాధ్యాయులను ఈ బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. పీఆర్‌సీ గురించి ప్రకటన చేయకపోవడం దారుణమని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కనీసం మధ్యంతర భృతి అయినా ప్రకటించిందని, ఈ ప్రభుత్వం మధ్యంతర భృతి కూడా ప్రకటించకుండా ఉపాధ్యాయులను దారుణంగా మోసం చేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment