
పాము కాటుతో చిన్నారి మృతి
పెదవేగి: పాముకాటుతో చిన్నారి మృతి చెందింది. పెదవేగి ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..పెదవేగి మండలం న్యాయంపల్లికి చెందిన మద్దాల సురేష్ భార్య గర్భిణి కావడంతో పుట్టింటికి వెళ్లింది. తల్లితో పాటే కుమార్తె సృజన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. సృజన ఆదివారం ఉదయం అమ్మమ్మ ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా తాచుపాము చిన్నారిని కాటు వేసింది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన చిన్నారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ సృజన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment