
పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
దెందులూరు: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్ద శనివారం అర్థరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉంటున్న ఊట్ల రామకృష్ణ కుటుంబసభ్యులు సొంత కారులో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వివాహానికి వెళ్లారు. అనంతరం శనివారం రాత్రి రాజమహేంద్రవరం బయలు దేరారు. రాత్రి రెండు గంటల సమయంలో ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్దకు వచ్చేసరికి లారీని దాటేందుకు ప్రయత్నించగా, కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నడుపుతున్న ఊట్ల రామకృష్ణకు తలపై, ఆయన భార్య అరుణకు కాలిపై గాయాలయ్యాయి. రామకృష్ణ నాన్నమ్మ అనంతలక్ష్మి, అరుణ అమ్మమ్మ సామ్రాజ్యం, కుటుంబసభ్యుడు ఇరుసుమల్లి మణికంఠ గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న దెందులూరు ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు, హైవే పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్‌న్సులో ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివాజీ తెలిపారు.
ఐదుగురికి గాయాలు

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment