
శ్రీవారి సేవలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్టింగ్ చైర్‌పర్సన్ విజయ భారతి సయాని ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. ఆమెకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆమెకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణ మూర్తి స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
రాట్నాలమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
పెదవేగి: రాట్నాలమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి విచ్చేసి, మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ వారం పూజా టిక్కెట్లపై రూ.38,240, విరాళాలుగా రూ.20,100, లడ్డూ ప్రసాదంపై రూ.19,725, ఫొటోల అమ్మకంపై రూ.2,000, ఆలయ నిర్మాణానికి రూ1,00,000 వచ్చిందని ఈవో ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఉండి: ఉండి గోరింతోట వద్ద పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపిన వివరాల ప్రకారం మృతుడి ఒంటిపై లేత పసుపు రంగు టీషర్టు, బ్లూ జీన్స్ ఉన్నాయి. చేతిపై గౌరీ కే ఆదిలక్ష్మీ అని పచ్చబొట్టు ఉంది. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు. వివరాలు తెలిసిన వారు 9440796648 నెంబర్‌లో సంప్రదించాలని ఎస్సై తెలిపారు.
క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న ఓంకార్
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామిని టీవీ యాంకర్ ఓంకార్ ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా గణపతి పూజ చేసి అనంతరం క్షీరారామలింగేశ్వరస్వామి, జనార్ధనస్వామి, లక్ష్మీపార్వతి అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు.

శ్రీవారి సేవలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్

శ్రీవారి సేవలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్
Comments
Please login to add a commentAdd a comment