
కనుల పండువగా కోదండరాముడి విగ్రహ ప్రతిష్ఠ
ఉండి: మండలంలోని చిలుకూరులో వేంచేసియున్న కోదండ రామాలయంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన కనులపండువగా నిర్వహించారు. దాతల సహకారంతో ఆలయాన్ని పునః నిర్మించారు. సర్పంచ్ ముదునూరి వెంకట సోమరాజు, ఆలయ ధర్మకర్త వేగేశ్న వెంకట రమణరాజు, ఆలయ నిర్మాణక మిటీ చైర్మన్ వేగేశ్న సత్యనారాయణ రాజు, దాతలు భీమరాజు, మాజీ సర్పంచ్ బంగార్రాజు, సీతారామరాజు తదితరులు ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని పూజ నిర్వహించారు. గ్రామంలోని భక్తులతో పాటుగా మహదేవపట్నం, వెలివర్రు, ఉండి, ఎన్నార్పీ అగ్రహారం, గరగపర్రు, భీమవరం తదితర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామరాజు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో పునఃప్రతిష్ఠాపన, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.ఽ
Comments
Please login to add a commentAdd a comment