
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
ఏలూరు(మెట్రో) : ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని ఆరు జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాల్లో గతనెల 27న పోలింగ్ జరిగింది.
69.50 శాతం పోలింగ్
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3,637, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 47,125, ఏలూరు జిల్లాలో 29,651, కాకినాడ జిల్లాలో 47,150, తూర్పుగోదావరి జిల్లాలో 42,446, పశ్చిమగోదా వరి జిల్లాలో 48,893 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 69.50 శాతం ఓటింగ్ నమోదు కాగా బ్యాలెట్ బాక్సులను ఏలూరులోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు.
బరిలో 35 మంది..
ఎన్నికల బరిలో 35 మంది నిలిచారు. కౌంటింగ్ కేంద్రానికి సిబ్బంది ఉదయం 6.30 గంటలలోపు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేయగా.. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మూడు షిప్టుల్లో 700 మంది సిబ్బంది పాల్గొంటారు. 28 టేబుళ్లను ఏర్పాటుచేయగా 17 రౌండ్లలో కౌంటింగ్ జరుగనుంది. ప్రతి టేబుల్‌కూ కౌంటింగ్ సిబ్బంది, సూపర్‌వైజర్, రోల్ ఇన్‌చార్జి, షిప్ట్ ఇన్‌చార్జి, మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తారు. తెలుగుదేశం బలపర్చిన అభ్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
సిబ్బందికి సమగ్ర శిక్షణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లను ఆదివారం ఆమె పరిశీలించారు. కౌంటింగ్‌పై సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చామన్నారు. ఉద యం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, లెక్కింపు పూర్తికావడానికి రెండు, మూడు రోజుల సమయం పట్టవచ్చన్నారు. పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. కౌంటింగ్ సిబ్బందికి డ్యూటీ పాసులు, ఏజెంట్లకు ఐడీ కార్డులు జారీ చేశామన్నారు. పాస్ లేనిదే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. సెల్‌ఫోన్‌లు నిషేధమన్నారు. పోస్టల్ బ్యా లెట్ ప్రక్రియ రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద నిర్వహిస్తామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజును కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జేసీ పి.ధాత్రిరెడ్డి, ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, డీఆ ర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డీఎస్పీ శ్రావణ్‌కుమార్, జెడ్పీ సీఈఓ కె.సుబ్బారావు తదితరులు ఉన్నారు.
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
28 టేబుళ్లు.. 17 రౌండ్లు
2,18,902 ఓట్ల లెక్కింపు
ఉదయం 8 గంటలకు ప్రారంభం

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment