
క్షయ ముక్తి భారత్‌గా బల్లిపాడు
పాలకొల్లు సెంట్రల్: టిబి ముక్తి భారత్ గ్రామంగా బల్లిపాడు గ్రామాన్ని ప్రకటిస్తున్నట్లు జిల్లా వైధ్యా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాను నాయక్ తెలిపారు. బుధవారం మండలంలోని లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిదిలో ఉన్న బల్లిపాడు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ భాను నాయక్ మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో ఈ గ్రామంలో క్షయ వ్యాధి పట్ల సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామంలో నిర్వహించిన పరీక్షల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. అందువల్ల బల్లిపాడు గ్రామాన్ని క్షయ వ్యాధి రహిత గ్రామంగా ప్రకటిస్తున్నామన్నారు. క్షయ వ్యాధి పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు బల్లిపాడు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతీ గ్రామాన్ని క్షయ వ్యాధి రహిత గ్రామంగా తీర్చిదిద్దేలా తమవంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూపతిరాజు ఇందిరాదేవి, కాగిత అశోక్, డాక్టర్ అడ్డాల ప్రతాప్ కుమార్, ఆరోగ్య విస్తరణాధికారి గుడాల హరిబాబు, జిల్లా టిబి ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి విద్యానంద్ తదితరులు పాల్గొన్నారు.
తీరంలో తాబేళ్లు మృతి
నరసాపురం రూరల్: తాబేళ్ల రక్షణ కోసం అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా అవి నీటి మూటలే అవుతున్నాయి. ఇటీవల తాబేళ్లు పెద్ద సంఖ్యలో సముద్ర తీరం వెంబడి మృత్యువాత పడిన విషయం మరువక ముందే బుధవారం మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో పలు తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కూడా వీటి మృత్యువాతకు ఒక కారణంగా భావిస్తున్నారు. తాబేళ్ల రక్షణలో అలసత్వం వహించే అధికారులు, సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం
భీమవరం(ప్రకాశంచౌక్): మహిళల ఆర్థిక సాధికారిత, భద్రతా, రక్షణ చర్యలో లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టరు చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం అమరావతి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.సూర్య కుమారి ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రేమ, ఆప్యాయత పంచాలి
భీమవరం(ప్రకాశంచౌక్): కరోనాతో చనిపోయిన కుటుంబాల పిల్లలకు ప్రేమ ఆప్యాయతలను పంచి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరేలా కృషి చేయాలని కలెక్టరు నాగరాణి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేటు పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య స్కీం కింద స్పాన్సర్‌షిప్ ప్రోగ్రాంలో కరోనా బాధిత పిల్లలతో కలెక్టరు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. బాధిత చిన్నారులకు ధైర్యం చెప్పారు.

క్షయ ముక్తి భారత్‌గా బల్లిపాడు
Comments
Please login to add a commentAdd a comment