
అభివృద్ధి పనుల కొనసాగింపులో జాప్యం
తణుకు అర్బన్: శాసన మండలిలో బుధవారం ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌లు సద్వినియోగం చేసుకోవడంలో పరిశ్రమల శాఖకు చెందిన ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) తీవ్ర జాప్యం చేస్తోందని, ఎంఎస్‌ఎంఈ నిధులతో మొదలుపెట్టిన అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయని అన్నారు. తణుకు, నెల్లిమర్ల, గాజులమండ్యం పారిశ్రామిక వాడలో రూ. 36 కోట్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయని వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి భరత్ సమాధానం ఇస్తూ కొంత జాప్యం జరిగిందని, ఇక నుంచి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పశ్చిమ గోదావరి డెల్టా పరిధిలోని మంచినీటి కాలువలలోకి పంచాయతీ వ్యర్థాలను వదులుతున్నారని, సిద్ధాంతం, పెనుగొండ, నర్సాపురం భీమవరం జీవీ కాలువల్లో వేస్ట్ వాటర్‌ను నేరుగా పైపుల ద్వారా కలిపేస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment