
నూరు శాతం పన్నులు వసూలు చేయాలి
భీమవరం(ప్రకాశంచౌక్): అన్ని పంచాయితీల్లో మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో పంచాయతీ కార్యదర్శుల సమీక్షా సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూరు శాతం పన్నులు వసూలుతో పాటు పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి రోడ్డు పక్కన చెత్త కనిపించకూడదన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి వర్మి కంపోస్ట్ చేయాలన్నారు. నూరు శాతం పన్నులు వసూలు చేసిన కోమటితిప్ప, మొగల్తూరు, పాలకోడేరు, కొత్త నవరసపురం, మైప, వేండ్ర అగ్రహారం, చింతపర్రు, జగన్నాధపురం, మినీమించిలిపాడు, తూర్పుపాలెం, పి.పోలవరం, అప్పన్న చెరువు, వద్దిపర్రు, తోకలపూడి, దరిసిపరు, అప్పారావుపేట, కృష్ణయ్యపాలెం గ్రామాల కార్యదర్శులకు మెమొంటోలు అందజేశారు.
నేడు వైన్ షాపులకు లాటరీ
భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 18 రిజర్వేషన్ వైన్ షాపులకు గురువారం కలెక్టరేట్‌లో మధ్యాహ్నం 3 గంటలకు లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకోవాలని కోరారు. ప్రతి దరఖాస్తుదారుడు దరఖాస్తుతోపాటు ఎంట్రీ పాస్, కుల ధ్రువీకరణ సర్టిఫికేట్, ఆథరైజేషన్ లెటర్ తీసుకుని రావాలన్నారు. మద్యం షాపు దక్కించుకున్న వెంటనే లైసెన్స్ రుసుం చెల్లించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment