
నారాయణపురంలో పంచాయతీ స్థలం స్వాహా
ఉంగుటూరు : ఆక్రమణకు కాదేది అనర్హం అన్న చందంగా తయారైంది కూటమి ప్రభుత్వంలో పరిస్థితి. కన్ను వేశారా అంతే హాంఫట్.. ఉంగుటూరు మండలం నారాయణపురంలో జాతీయరహదారిని ఆనుకుని గ్రామ పంచాయతీకి చెందిన ఆరు సెంట్ల స్థలాన్ని టీడీపీ తన పేరున ఏకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సర్వే నెంబరు–156/2లో ఉన్న ఈ స్థలాన్ని టీడీపీ నేత గంటా యువరాజు తన భార్య పేరున పంచాయతీ స్థలం సరిహద్దులతో 156/1 సర్వే నెంబరుతో ఇటీవల గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేయించారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అని, తండ్రి తనకు రాశారని రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ అధికారులు ఉలిక్కిపడ్డారు. పంచాయతీ కార్యదర్శి విజయ్ తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్‌న కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ నకళ్లు తీసుకున్నారు. చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో మంగళవారం పంచాయితీ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఆ పంచాయితీ స్థలానికి సర్వే చేయించి హద్దులు నిర్ణయించి రాటలు పాతారు. ఫెన్సింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.పంచాయతీకి చెందిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయంపై పోలీస్టేషన్‌లో కేసు పెట్టామని కార్యదర్శి తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి రద్దు చేయిస్తామని విజయ్ తెలిపారు. ఈ స్థలం మార్కెట్ విలువ రూ.కోటి ఉంటుందని అంచనా.
గూడెం రిజిస్ట్రార్ కార్యాలయంలో గోల్‌మాల్
ఈ స్థలాన్ని తప్పడు సర్వే నెంబరుతో ఎలా రిజిస్ట్రేషన్ చేశారనేది ప్రశ్న. ఈ వ్యవహరంలో తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొందరి హస్తం ఉండొచ్చంటున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన 90 రోజుల వ్యవధిలో సర్వే నెంబరు తప్పుగా నమోదైందనే వంకతో ప్రభుత్వ భూమిని కాజేయలనేది ఆ నాయకుడు ఎత్తుగడ. ఈ భూమిని మరో వ్యక్తికి గత నెల 12న తనఖా రిజిస్ట్రేషన్ కూడా చేశారు.
తన భార్య పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్న టీడీపీ నేత
Comments
Please login to add a commentAdd a comment