తెల్లారిన బతుకులు | - | Sakshi
Sakshi News home page

తెల్లారిన బతుకులు

Published Fri, Mar 7 2025 9:02 AM | Last Updated on Fri, Mar 7 2025 8:58 AM

తెల్ల

తెల్లారిన బతుకులు

తెల్లవారకముందే.. వారి జీవితాలు తెల్లారిపోయాయి. కొద్ది గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉండగా మృత్యువు వారిని కబళించింది. అతివేగం, పొగమంచు కారణంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నుంచి కారిన రక్తధారలు భయభ్రాంతులకు గురిచేయగా.. క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. ఏలూరు జిల్లా ఏలూరులోని చొదిమెళ్ల వద్ద జాతీయరహదారి (ఎన్‌హెచ్‌–16)పై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్‌ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బస్సులోని 21 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఘటనా స్థలిలో బస్సు దెబ్బతిన్న తీరు చూస్తే ప్రమాద తీవ్రత అర్థమవుతుంది.

శురకవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025

జాతరకు వస్తూ..

మృతుడు బొంతు భీమేశ్వరరావు భీమడోలుకు చెందినవారు. పెయింటర్‌ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆయన సొంతూరులో జరిగే జాతరకు హైదరాబాద్‌ నుంచి వస్తున్నారు. మరో 20 నిమిషాల్లో సొంతూరుకు చేరుకుంటారనుకున్న సమయంలో మృత్యువు కబళించింది. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ భవాని

మృతురాలు మొటపర్తి భవానిది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రవారిపాలెం. ఆమె హైదరాబాద్‌ లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబసభ్యులను చూసేందుకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మృత్యవాత పడ్డారు. భవానీ అకాల మరణం ఆ కుటుంబంలో తీరని శోకం నింపింది.

బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ..

మృతురాలు జుత్తిగ భవాని గృహిణి. ఆమెది డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కోలంక గ్రామం. బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న సమయంలో ఆమె ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మృతుడు డ్రైవర్‌ మధు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గీత కార్మికులకు 18 మద్యం షాపులు

భీమవరం(ప్రకాశం చౌక్‌): జిల్లాలో గీత కార్మికులకు మద్యం షాపుల కేటాయింపును లాటరీ పద్ధతి ద్వారా పూర్తిచేసినట్టు జేసీ టి.రాహుల్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో 18 మద్యం షాపులకు సంబంధించి లాటరీ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 478 దరఖాస్తులు అందాయని, మొత్తం షాపులకు రెండు నెలల ఫీజు కింద రూ.95,83,333 రుసుం జమచేసి షాపులు కేటాయిస్తామన్నారు. కులా ల వారీగా శెట్టిబలిజ 10, గౌడ 5, గౌడ్‌ 2, శ్రీశయన 1 చొప్పున షాపులు కేటాయించామన్నారు. దరఖాస్తులకు నాన్‌ రిఫండబుల్‌ కింద రూ.9.56 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. స్టేషన్ల వారీగా భీమవరంలో 2, తణు కులో 5, తాడేపల్లిగూడెంలో 4, పాలకొల్లులో 2, నరసాపురంలో 3, ఆకివీడులో 2 దుకాణాలు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. లాటరీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఎకై ్సజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కేవీ నాగప్రభుకుమార్‌, జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌ఎస్‌ కుమారేశ్వరన్‌, సహాయ ఎకై ్సజ్‌ అధికారి ఆర్‌వీ ప్రసాద్‌రెడ్డి, ఎకై ్సజ్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

20 ఆటోలపై కేసులు

భీమవరం (ప్రకాశంచౌక్‌): అధిక సంఖ్యలో పిల్లలను తరలించే ఆటోలపై చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వర రావు హెచ్చరించారు. భీమ వరంలోని పలు చోట్ల గురువారం స్కూల్‌ పిల్లలను తరలించే ఆటోలను తనిఖీలు చేశామన్నారు. 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లలను ఆరుగురిని మాత్రమే ఎక్కించుకోవాలని, స్కూల్‌ బ్యాగులు, లంచ్‌ బాక్స్‌లు ఆటో బయటకు రాకుండా చూసుకోవాలన్నారు. డ్రైవర్‌కు ఇరువైపులా పిల్లలను కూర్చోపెట్టకూడదని, స్కూల్‌ ట్రిప్‌ బోర్డును ఎరుపు రంగులో ఆటో ముందు, వెనుక ప్రదర్శించాలని ఆదేశించారు. 20 ఆటోలపై కేసులు నమోదు చేసి, ఒక ఆటోను సీజ్‌ చేశామన్నారు. మొత్తంగా రూ.75,170 అపరాధ రుసుం వసూలు చేశామని చెప్పారు.

నీటి ఎద్దడి తలెత్తకూడదు

దెందులూరు/ఏలూరు (టూటౌన్‌): జిల్లాతో తాగు, సాగునీటి సమస్య లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం దెందులూరు మార్కెట్‌ కమిటీ చెక్‌ పోస్టు సమీపంలో ఏలూరు నగరానికి సాగునీటి సరఫరా చేసే సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. దెందులూరు కాలిబాట వంతెన వద్ద ఏలూరు కాల్వలో తూడు తొలగింపు పనులనూ పరిశీలించారు. ఏలూరు కాలువ ద్వారా సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను నీటితో నింపేందుకు పర్యవేక్షణ చేయాలన్నారు. చేపల చెరువులకు అక్ర మంగా నీటి మళ్లింపును అరికట్టేలా కాలువ గట్ల వెంబడి పటిష్ట నిఘా ఉంచాలన్నారు. అనంతరం వాటర్‌ పంప్‌ హౌప్‌ వద్ద కలెక్టర్‌ మొక్క నాటారు. ఏలూరు కాలువలో మూడున్నర అడుగుల మేర నీరు ఉందని ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈ పి.నాగార్జునరావు తెలిపారు. ఆర్డీఓ అచ్యుత్‌ అంబరీష్‌, కమిషనర్‌ భానుప్రతాప్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్‌ బాషా ఉన్నారు.

‘గురుకుల’ ప్రవేశాలకు ఆహ్వానం

ఏలూరు (టూటౌన్‌): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సమన్వయ అధికారి బి.ఉమాకుమారి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపికచేస్తామని, దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈనెల 13 వరకు పొడిగింంచామని పే ర్కొన్నారు. వచ్చేనెల 6న ప్రవేశ పరీక్షలు నిర్వ హిస్తామని తెలిపారు. ఏలూరు జిల్లాలో బాలురుకు పెదవేగి, చింతలపూడి, బాలికలకు పో లసానిపల్లి, వట్లూరు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, నూజివీడులో పాఠశాలలు ఉన్నాయన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో బా లురుకు ఆరుగొలను, న్యూ ఆరుగొలను, ఎల్‌ బీ చర్ల నరసాపురంలో, బాలికలకు పెనుగొండలో పాఠశాలలు ఉన్నాయన్నారు.

కొనసాగిన ఇంటర్‌ పరీక్షలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గురువారం గణితం–1ఏ, బోటనీ, సివిక్స్‌–1 పరీక్షలు జరిగాయి. జిల్లాలో 55 కేంద్రాల్లో 19,400 మంది విద్యార్థులకు 18,195 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్‌ తెలిపారు. అలాగే ఇంటర్‌ సంస్కృతం జవాబుపత్రాల మూల్యాంకనం శుక్రవారం నుంచి ఏ లూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రారంభమవుతుందని చెప్పారు.

డెడ్లీ జర్నీ

ఏలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

వేకువజామున ఘటన

లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

ఘటనా స్థలంలో ముగ్గురు, చికిత్స పొందుతూ మరొకరు మృతి

21 మందికి గాయాలు

ఏలూరు రూరల్‌: ఏలూరులోని చొదిమెళ్ల వద్ద రత్నాస్‌ హోట ల్‌ సమీపంలో విజయవాడ నుంచి రాజమండ్రి వెళుతు న్న సిమెంట్‌ లారీ (ఏపీటీ 91ఏ 1769) మరమ్మతుల కారణంగా నిలిచిపోయింది. గురువారం వేకువజామున 5 గంటల సమయంలో రమ ణ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు (ఎన్‌ఎల్‌ 01బీ 3092) హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళుతుండగా వేగంగా నడుపుతున్న బస్సు డ్రైవర్‌ రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్‌ లారీని గుర్తించలేకపోయాడు. చివరి నిమిషంలో బస్సును తప్పించేందుకు ప్రయత్నించగా లారీ వెనుక భాగాన్ని ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. బస్సులో కండక్టర్‌ వైపు భాగం చీల్చుకుంటూ వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. ప్రమాదంతో ఉలిక్కిపడిన స్థానికులు, ఇతర వాహనాల డ్రైవర్లు హుటాహుటిన వచ్చి ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నించారు. హైవే పెట్రోలింగ్‌ పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకువచ్చారు. క్షతగా త్రులను 108లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం రక్తసిక్తం కాగా.. పరిసరాల్లో బస్సులోని విడి భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

శకలాల మధ్య ఇరుక్కుపోయి..

బస్సులో కండక్టర్‌ సీటు వైపు కూర్చున్న మహిళలు మొటపర్తి భవాని, జుత్తిగ భవాని, పురుషుడు బొంతు భీమేశ్వరరావు శకలాల్లో చిక్కుకుపోయారు. లారీ డ్రైవర్‌ మధు సైతం స్టీరింగ్‌ వద్ద ఇరుక్కుపోయాడు. పోలీసులు క్రేన్‌ సాయంతో బస్సును లేపి పక్కకు చేర్చారు. శకలాలను తప్పించి ముగ్గురు ప్రయాణికులతో పాటు డ్రైవర్‌ను అంబులెన్స్‌ ద్వారా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రయాణికులు ముగ్గురు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్‌ మధుకు అత్యవసర చికిత్స అందించగా నాలుగు గంటల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. ఏలూరు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు.

క్షత్రగాత్రులు వీరే..

ప్రమాదంలో గాయాలపాలైన వారిలో కోలా సురేఖ, కోలా రాజాబాబు, కోలా లిఖిత, వనమనీడి ఆదిలక్ష్మి, మద్దాల కీర్తి, మాచర్ల సుజాత, మండపాక బాలాజీ, మండపాక శ్రీదేవి, మండపాక హరిణి, మండపాక శశిరేఖ, ఆర్నాలకంటి శ్రీలక్ష్మి, కోట వేణి, పువ్వుల శ్యామ్‌కుమార్‌, శీలం ప్రకాష్‌, ఎం.ప్రతాప్‌, పి.అక్కమ్మ, పి.హేమలత, గోణజ విజయకుమార్‌, రామిశెట్టి సోమసత్యనారాయణ, టి.రవికుమార్‌, జి.మణికంఠ (క్లీనర్‌) ఉన్నారు. అధికారులు క్షతగాత్రులకు చికిత్స చేయించి వారి గమ్యస్థానాలకు పంపించారు. క్షతగాత్రులు పాలకొల్లు, రాజమండ్రి, కాకినాడప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.

న్యూస్‌రీల్‌

నైట్‌ పెట్రోలింగ్‌ నామమాత్రం

దెందులూరు: భీమడోలు నుంచి హనుమాన్‌ జంక్షన్‌ వరకు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–16) మృత్యు మార్గంగా మారింది. ఈ ప్రాంతంలో తరచూ ప్ర మాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా నైట్‌ పెట్రోలింగ్‌ తూతూమంత్రంగా జరుగుతుండటం విమర్శలకు తావిస్తోంది. రాత్రి వేళ పెట్రోలింగ్‌కు సిబ్బంది, వాహనాలు ఉన్నా పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఈ వాహనమైనా రాత్రి వేళ హైవేపై నిలిచిపోతే హైవే పోలీసులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉండటం లేదు. అలాగే పెట్రోలింగ్‌ పోలీసులు నిత్యం పెట్రోలింగ్‌ చేయడం ద్వారా కొంతవరకు ప్రమాదాలను నివారించవచ్చని డ్రైవ ర్లు అంటున్నారు. వారంలో ఒక్కరోజైనా సీఐ స్థా యి నుంచి పై స్థాయి అధికారి రాత్రిళ్లు పెట్రోలింగ్‌పై తనిఖీలు చేయాలని అంటున్నారు. ప్రమాదాలు ఎక్కువగా రాత్రి 12.30 నుంచి వేకువజామున 5 గంటలలోపు జరుగుతున్నాయి.

ప్రతిపాదనలకే షెల్టర్‌ పరిమితం

లారీలు, భారీ వాహనాల నిలుపుదల, డ్రైవర్ల విశ్రాంతికి జాతీయరహదారిపై కలపర్రు నుంచి భీమడోలు వరకు ఎలాంటి సౌకర్యాలు, స్థలం లేవు. గతంలో స్థలం కోసం గుండుగొలను వద్ద కలెక్టర్‌ పరిశీలన చేశారు. అక్కడ షెల్టర్‌ నిర్మించాలని ప్రతిపాదనలు చేసినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దెందులూరు నియోజకవర్గంలో డ్రైవర్ల విశ్రాంతి, వాహనాల నిలుపుదలకు కనీసం పది ఎకరాల్లో షెల్టర్‌ ఏర్పాటు చేయాలని చాలాకాలంగా డ్రైవర్లు కోరుతున్నారు. ఇక్కడ ప్రమాదాల నివారణకు షెల్టర్‌ దోహదపడుతుందని వాహనాల డ్రైవర్లు అంటున్నారు.

బాలుడి మృతిపై విచారణకు డిమాండ్‌

ఏలూరు (టూటౌన్‌): చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులకు ప్రజల ప్రాణాలకు ముప్పుతెచ్చే హక్కులేదని, తప్పు చేసిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టి శిక్షించాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. తమ బిడ్డను పోలీసులే చంపేశారంటూ ఏలూరులోని తంగేళ్లమూడిలో నివాసముంటున్న యశ్వంత్‌ అనే బాలుడు కుటుంబసభ్యులు ఏలూరులో ఆస్పత్రి వద్ద గురువారం ఆరోపణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యశ్వంత్‌ మృతికి పోలీసులే కారణమైతే బాధాకరమని, సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం కార్యదర్శి రవి డిమాండ్‌ చేశారు.

అతి వేగం.. పొగ మంచు

అతివేగం, పొగమంచు ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. వేకువజామున పొగమంచు కురవడంతో బస్సు డ్రైవర్‌ ఆగి ఉన్న లారీని గుర్తించలేకపోయాడు. మరోపక్క లారీ డ్రైవర్‌ లారీని జాతీయరహదారి ప క్కన నిలపడం ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ఘటనా స్థలానికి 30 మీటర్ల దూరంలో పార్కింగ్‌ రోడ్డు ఉందని, జాతీయరహదారిపై ఎక్కడిపడితే అక్కడ వాహనాలను నిలుపుదల చేయడం ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. డ్రైవర్లు వాహనాలను పార్కింగ్‌ స్థలాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
తెల్లారిన బతుకులు 1
1/9

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు 2
2/9

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు 3
3/9

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు 4
4/9

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు 5
5/9

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు 6
6/9

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు 7
7/9

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు 8
8/9

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు 9
9/9

తెల్లారిన బతుకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement