అబద్ధాలకు కేరాఫ్ చంద్రబాబు
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
తణుకు అర్బన్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చామని, ఉచిత బస్సులు తిరుగుతున్నాయని జాతీయ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాకా ఊదుతున్నారని, ఆయన మాదిరిగానే ఎమ్మెల్యేలంతా అబద్ధాలు చెబుతూ కాలం గడిపేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో కూటమి బండారాన్ని ఉతికారేస్తున్నారని చెప్పారు. ‘బస్సులు మా ఇంటికి వచ్చి ఎక్కించుకుంటున్నాయని.. గ్యాస్ సిలిండర్లు బుక్ చేయకుండానే ఇంటికి ఉచితంగా వచ్చేస్తున్నాయని.. రూ.15 వేలు మా ఇంట్లో అందరికీ అందేశాయని..’ కూటమి ఘనకార్యాలను ప్రజలు గొప్పగా వెటకారాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయని, మద్యం ఇంటికి సరఫరా చేసే పరిస్థితి నెలకొందని, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం తణుకులో రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని శంకుస్థాపన చేశా రని గుర్తుచేశారు. ఈ ప్రభు త్వం వచ్చిన తరువాత అవి మూలనపడ్డాయని విమర్శించారు. 2019 నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామని, సన్న బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మేలు చేశామని తెలిపారు. తమ హయాంలో విజిలెన్స్ దాడుల్లో పట్టుబడిన బియ్యాన్ని అదే నెలలో ఎక్కువ ధరలకు విక్రయాలు చేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చామని గుర్తుచేశారు. నేడు మరలా రేషన్ బియ్యం అక్రమ మార్గంలో తరలిస్తున్నారంటే అదంతా కూటమి ప్రభుత్వ దయేనని అన్నారు. రాష్ట్రంలో చెత్త కుప్పలు పేరుకున్న విష యాన్ని నేడు ఎల్లోమీడియా పత్రికలోనే వస్తుండటం చూస్తున్నామని గుర్తుచేశారు. చెత్త, మద్యం విక్రయాలపై ఎన్నికల హయాంలో తణుకు ఎమ్మెల్యే టిక్‌టాక్‌లు చేశారని, సంక్రాంతి వచ్చేప్పటికీ అన్ని రహదారులు వేస్తామని బింకాలు పోయారని, అయితే ప్యాచ్ వర్కులతో సరిపెట్టా రని కారుమూరి దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment