
విజిలెన్స్ తనిఖీలు
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం పశుసంవర్ధకశాఖ ఏడీఏ కార్యాలయంలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఏడీఏ డాక్టర్ సుధీర్‌పై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ సీఐ శివరామకృష్ణ ఆధ్వర్యంలో సోదాలు జరిపి రికార్డులు పరిశీలించారు. వైద్య సేవలు సరిగా అందడం లేదని, మందులు ఉచితంగా ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. భీమవరం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆలీ మందులను పరిశీలించారు.
బయో ప్రింటింగ్‌పై విస్తృత పరిశోధనలు
తాడేపల్లిగూడెం: జీవ కణాలు అభివృద్ధే 3డీ బయో ప్రింటింగ్ అని ఏపీ నిట్ రిజిస్ట్రార్ పి.దినేష్ శంకర్ రెడ్డి అన్నారు. ఏపీ నిట్‌లో ఇనిస్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్, నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ సౌజన్యంతో నెక్స్‌జెన్ బైఫాబ్రికేషన్ ఇన్నోవేషన్స్ ఇన్ 3డీ బయో ప్రింటింగ్ అండ్ ఫంక్షనల్ బయో మెటీరియల్స్ అనే అంశంపై విద్యార్థులకు 5 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా శంకర రెడ్డి మాట్లాడుతూ 3డీ బయో ప్రింటింగ్‌పై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. బయో ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతులు సుందర్శన దీప, వినోత్ కుమార్‌రాజా మాట్లాడుతూ 3డీ బయో ప్రింటింగ్ ప్రాధాన్యత, వాటి రకాలు, ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. ఆచార్యులు శారదా ప్రసన్న మాలిక, వందన కుమారి కో–ఆర్డినేటర్లుగా వ్యవహరించారు. శిక్షణకు హాజరైన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్‌ఏసీ) ఎం.సునీల్‌కుమార్ ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాసదన్‌లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ముందుగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
హౌస్ కీపింగ్ పోస్టులకు సీల్డు టెండర్ల ఆహ్వానం
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి యూనిట్‌లోని కోర్టు కాంప్లెక్స్‌ల హౌస్ కీపింగ్ సర్వీస్ (క్లీనింగ్) కోసం వార్షిక నిర్వహణ కాంట్రాక్టును రెండేళ్ల కాలానికి ఇవ్వడానికి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్‌ఏసీ) ఎం.సునీల్‌కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఏలూరులోని కోర్టు కాంప్లెక్స్‌లకు ఇద్దరు సూపర్‌వైజర్లు, 54 మంది హౌస్‌మెన్ /హౌస్‌మెయిడ్‌లు అవసరమని, వీరిలో నలుగురికి ప్లంబింగ్, వడ్రంగి, విద్యుత్ పనుల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గలవారు తమ టెండర్ దరఖాస్తులను ఈనెల 17న సాయంత్రం 5 గంటలలోపు ఏలూరులోని జిల్లా కోర్ట్ కార్యాలయానికి అందేలా పంపాలని పేర్కొన్నారు.
మహిళా దినోత్సవానికి జెస్సీరాజ్
దెందులూరు: అమరావతిలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలకు అంతర్జాతీయ స్కేటర్, ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డు గ్రహీత ఎం.జెస్సీరాజ్‌కు ఆహ్వా నం అందింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రముఖులు 9 మందిని ఎంపిక చేయగా వారిలో జెస్సీరాజ్ ఒకరు.

విజిలెన్స్ తనిఖీలు

విజిలెన్స్ తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment