
మహిళల రక్షణకు ప్రాధాన్యం
భీమవరం(ప్రకాశం చౌక్): మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యమిస్తోందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విద్యార్థినులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈనెల 1 నుంచి జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలను చేపట్టామన్నారు. దీనిలో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థినులకు పోలీసుశాఖ ఆయుధాలు, సాంకేతికత, కమ్యూనికేషన్, డ్రోన్స్, బీడీ టీమ్స్, బాడీవోర్న్ కెమెరాలు, పలు పరికరాలపై అవగాహన కల్పించామన్నారు. అలాగే డయల్ 100/112, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, ఉమెన్ హెల్ప్‌లైన్ 181, సైబరు క్రైం ఫిర్యాదు కోసం 1930 టోల్ ఫ్రీ నంబర్ల ప్రాధాన్యతను వివరించామన్నారు. శనివారం ముగింపు వేడుకలు నిర్వహించి, జిల్లావ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు. ఏఎస్పీ వి.భీమారావు, పోలీసు అధికారులు ఎంవీవీ సత్యనారాయణ, వి.పుల్లారావు, డి.వెంకటేశ్వరరావు, డి.సురేష్, కె.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment