
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పాలకొల్లు సెంట్రల్: రొయ్యల చెరువుల వద్ద విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై బి.సురేంద్రకుమార్ తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని తిల్లపూడి గ్రామానికి చెందిన నడపన శ్రీనివాస్ (44) సోమవారం ఉదయం చెరువుల వద్దకు పనికి వెళ్లాడు. మోటర్‌కు ఉన్న విద్యుత్ వైర్లను గమనించకపోవడంతో ఆ వైర్లు తగిలి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణకు అతనే ఆధారం. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేంద్ర తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment