
బాబు వచ్చే.. జాబు రాదే?
●
జాబ్ క్యాలెండర్ ఊసే లేదు
జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో ఆర్భాటంగా ప్రకటించారు. ఎన్నికల్లో సైతం హామీలు ఇచ్చారు. అయితే ఇప్పటివరకూ జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగ భృతి సైతం మరిచిపోయారు. నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది.
–సుంకర సీతారాం, కొడమంచిలి
నిరుద్యోగ భృతి ఎప్పుడో?
సూపర్ సిక్స్‌లో భాగంగా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. ఈ పథకాన్ని ఇప్పటివరకూ అమలు చేయలేదు. చదువులు చదివి ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబ భారం పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందించి నిరుద్యోగులను ఆదుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం ముందు అడుగు వేయాలి.
– ఎ.త్రినాథ్, నిరుద్యోగి, తాడేపల్లిగూడెం
యువతకు మోసం
చంద్రబాబు 2014 ఎన్నికల్లోనూ నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. మరలా గత ఎన్నికల్లోనూ ఈ హామీ ఇచ్చారు. సూపర్‌సిక్స్ హామీలతో అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటివరకూ నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. ఇలా మోసపూరిత వాగ్దానాలతో యువతను మోసం చేయడం సమంజసం కాదు.
–పాలపర్తి సందీప్, ఏనుగువానిలంక
సాక్షి, భీమవరం: జిల్లాలో దాదాపు ఎనిమిది ఇంజినీరింగ్ కళాశాలలు, 55 వరకు డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, వృత్తివిద్యా కోర్సుల కళాశాలలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారు. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసి డీఎస్సీ, గ్రూపు పరీక్షలు, పోలీస్ రిక్రూట్‌మెంట్, ఏపీపీఎస్సీ తదితర కొలువుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు వేలల్లో ఉన్నారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రులు ఎందరో. ఉన్నత చదువులు చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అరకొర జీతంపై స్థానికంగా, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి వ్యాపార, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిలో ఎంతోమంది తమ చదువుకు తగ్గ ఉద్యోగం కోసం చూస్తున్నారు.
హామీల ఊసే లేదు
కూటమి అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్, నిరుద్యోగభృతి హామీలను ప్రభుత్వం విస్మరించింది. ఈ పథకం అమలుకు వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. 16 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించినా షెడ్యూల్ విడుదల చేయకుండా విద్యాసంవత్సరం కాలయాపన చేసేశారు. 20 లక్షల ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు.
రోడ్డున పడేసి.. ఉన్న జాబులు పీకేసి..
కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటిని తొలగించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. వలంటీర్ల జీతం రూ.10 వేలు చేస్తామని చెప్పి వారిని విధుల్లోకి తీసుకోకుండా పక్కన పెట్టేయ్యడంతో జిల్లాలో 9,547 మంది వలంటీర్లు సేవలకు దూరమయ్యారు. ప్రైవేట్ మద్యం పాలసీతో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన 893 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది రోడ్డున పడ్డారు. కక్ష సాధింపుల్లో భాగంగా పలువురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు వేశారు.
రూ.158.8 కోట్ల మేర బకాయిలు
పాత బకాయిలు, ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను జిల్లాలోని 31,412 మంది విద్యార్థులకు సంబంధించి సుమారు రూ.158.8 కోట్ల మేర విద్య, వసతి దీవెన పథకాల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆయా పథకాల పేర్లు మార్చిన ప్రభుత్వం నిధులివ్వక కళాశాలలకు ఫీజులు చెల్లించేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భరోసా
గత వైఎస్సార్‌సీపీ నిరుద్యోగులు, విద్యార్థులకు అండగా నిలిచింది. అమ్మఒడి పథకం ద్వారా ఐదేళ్లలో జిల్లాలోని 1,48,342 మంది తల్లుల ఖాతాలకు రూ.887.9 కోట్లు జమ చేశారు. జిల్లాలోని 1,77,996 మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన పథకం కింద రూ.485.33 కోట్లు, వసతి దీవెన పథకం కింద 1,76,142 మందికి రూ.163.41 కోట్లు సాయం అందించింది. నిర్ణీత సమయంలో ప్రభుత్వం ఫీజులు అందించడంతో తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండేవారు.
కూటమి దగా
జవవరి 1నే జాబ్ క్యాలెండర్
20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు హామీ
పది నెలల్లో ఒక్క జాబూ ఇవ్వలేదంటున్న నిరుద్యోగులు
ఉద్యోగాల కోసం వేలాది మంది ఎదురుచూపులు
వలంటీర్లు, చిరుద్యోగుల పొట్టగొట్టిన కూటమి సర్కారు
నిరుద్యోగులకు బాసటగా రేపు వైఎస్సార్‌సీపీ ‘యువత పోరు’
జాబు కావాలంటే బాబు రావాలన్నారు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. పరిశ్రమలు తెస్తామన్నారు. వర్క్ ఫ్రం హోం కోసం హైటెక్ టవర్లు కడతామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగభృతి ఇస్తామంటూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ఎడాపెడా హామీలిచ్చేశారు. తల్లికి వందనం అన్నారు. పది నెలల పాలనలో కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటిని తొలగిస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ యువత, విద్యార్థుల పక్షాన 12వ తేదీన వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ నిర్వహించనుంది.
రేపు వైఎస్సార్‌సీపీ ‘యువత పోరు’
యువత, విద్యార్థులను కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతూ వారి పక్షాన బుధవారం ‘యువత పోరు’ నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ యువత, విద్యార్థులతో కలిసి భీమవరంలోని కలెక్టరేట్‌కు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలివెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నారు.
నిరుద్యోగ
భృతి
ఎప్పుడు
ఉద్యోగాల
మాటేంటి?

బాబు వచ్చే.. జాబు రాదే?

బాబు వచ్చే.. జాబు రాదే?

బాబు వచ్చే.. జాబు రాదే?
Comments
Please login to add a commentAdd a comment