ప్రగతి పరవళ్లు
ఐదేళ్లు
నేడు ఆవిర్భావ దినోత్సవం
పరుచుకున్న ప్రగతి
● పేదవర్గాల వారి సొంతింటి కలను సాకారం చేస్తూ జిల్లాలోని సుమారు 76,069 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు.
● ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తూ నరసాపురంలో రూ.332 కోట్ల వ్యయంతో ఆక్వా వర్శిటీ మంజూరు చేశారు.
● పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్ల వ్యయంతో 61 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల పనులు చేపట్టారు.
● పాలకొల్లులో రూ.13.50 కోట్లతో 150 పడకల ఆసుపత్రి నిర్మించగా.. నరసాపురంలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. భీమవరంలో రూ.40 కోట్ల వ్యయంతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు చేపట్టారు.
● తాడేపల్లిగూడెంలో రూ.36 కోట్లతో కోడేరు–నల్లజర్ల (కేఎన్ రోడ్డు)ను నాలుగు లైన్లుగా విస్తరించారు. రూ.వందల కోట్లు వెచ్చించి జిల్లాలోని ఎన్నో రోడ్లను అభివృద్ధి చేశారు.
● దాదాపు రూ.540 కోట్ల వ్యయంతో గ్రామాల్లో సచివాలయలు, ఆర్‌బీకేలు, హెల్త్ క్లినిక్‌లు, బల్క్‌మిల్క్ యూనిట్లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టారు.
సాక్షి, భీమవరం : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అక్కచెల్లెమ్మల అభ్యున్నతికి ‘చేయూత’నందించారు. వారి డ్వాక్రా రుణమాఫీకి ‘ఆసరా’ అయ్యారు.. అగ్రవర్ణాల పేద మహిళలకు శ్రీనేస్తంశ్రీగా నిలిచారు. పేదల చదువులకు ‘అమ్మఒడి’లా వారి ఉన్నతికి విద్య, వసతి దీవెనలు అందించారు. సాగులో రైతుకు, వేట విరామంలో మత్య్సకారులకు ‘భరోసా’గా ఉన్నారు. నేతన్నలకు ‘నేస్తం’ అయ్యారు. వలంటీర్, సచివాలయ వ్యవస్థలు తెచ్చి కులమత వర్గాలు, రాజకీయాలు చూడకుండా సంక్షేమ లబ్ధిని పేదల చెంతకు చేర్చారు. నేడు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకల నిర్వహణకు పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే నవరత్నాల అమలుకు అడుగులు వేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ, వలంటీర్ వ్యవస్థలు తెచ్చారు. పింఛన్ కోసం అవ్వాతాతలు పడిగాపులకు చెక్ పెట్టారు. 1వ తేదీ ఉదయాన్నే ఇంటికి వెళ్లి పింఛన్ సాయాన్ని చేతికందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతికి వైఎస్సార్ పెన్షన్ కానుక, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, టైలర్లు, రజకులు, నాయి బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు, డ్రైవర్ల కోసం వాహనమిత్ర, మత్య్సకారులకు మత్య్సకార భరోసా, చేనేత కార్మికుల కోసం నేతన్న నేస్తం తదితర ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా పేదలను ఆదుకున్నారు. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ఉమ్మడి జిల్లాలోని పేదలకు సుమారు రూ.2,500 కోట్ల లబ్ధి చేకూరింది. ఉచిత పంటల బీమా, ఆర్‌బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేశారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోని రైతులకు రూ.796.49 కోట్ల సాయం అందించారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా ఉమ్మడి జిల్లాలోని దాదాపు 11.82 లక్షల మంది లబ్ధిదారులకు ఏ విధమైన సర్వీస్ చార్జీ లేకుండానే కుల ధ్రువీకరణ, ఆదాయ, జనన, మరణ, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తదితర 12.04 లక్షల సర్టిఫికెట్లు అందజేశారు.
ఆరోగ్యానికి ధీమా
జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లతో పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. స్పెషలిస్ట్ వైద్యులతో విలేజ్ క్లినిక్‌లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యశిబిరాలు ఏర్పాటుచేశారు. 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచి 15 లక్షల మందికి పైగా రోగులకు వైద్యసేవలందించారు. ఆరోగ్యశ్రీలో రూ. 5 లక్షల వరకు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు, 1,059గా ఉన్న చికిత్సల సంఖ్యను 3,257కు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి మరింత భద్రత కల్పించారు
పేదలకు డిజిటల్ విద్య
నాడు నేడు ద్వారా రూ.36,913 కోట్లతో పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా అభివృద్ధి చేశారు. పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా డిజిటల్ విద్యాబోధన చేపట్టారు. 8వ తరగతి విద్యార్థులకు రూ.30 వేలు విలువ చేసే ట్యాబ్‌లు అందజేశారు. జగనన్న అమ్మ ఒడి పథకంలో 1,48,342 మంది తల్లులకు రూ.887.9 కోట్లు, పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలుగా రూ.770 కోట్లు సాయం అందించారు.
సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థతో గడప వద్దకే సంక్షేమ లబ్ధి
పేదల వైద్యానికి పెద్దపీట
నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
నవరత్నాలతో పేదల ఉన్నతికి బాటలు
జగనన్న సురక్షతో ఉచితంగా సర్టిఫికెట్ల జారీ
ఆక్వా వర్శిటీ, మెడికల్ కళాశాల మంజూరు
నేడు వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
సంక్షేమ పథకాలతో మహిళలకు బాసట
గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు అందించిన అనేక సంక్షేమ పథకాలు ఆర్థికంగా చేయూతనిచ్చాయి. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పెళ్లికానుకతో సహా మహిళల ఖాతాలో వేశారు. నాటి ప్రభుత్వం అందించిన పథకాల ఆర్థిక సాయం మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేశాయి. నేడు పథకాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. – పూజారి వెంకటలక్ష్మి, భీమవరం
యువతకు ఉద్యోగాల కల్పన
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ వ్యవస్థ, వలంటీరు వ్యవస్థ తీసుకొచ్చి లక్షల మంది యువతకు ఉపాధి కల్పించారు. సొంత ఊళ్లోనే ఉంటూ ఉద్యోగాలు చేసుకునే కలను సాకారం చేశారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఇంతవరకూ జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఊసే లేదు.
– వి.దివ్య, వీరవల్లి పాలెం
గ్రామాల అభివృద్ధి
జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. గ్రామ సచివాలయాలు, హెల్త్ సెంటర్లు, ఆర్బీకేలు ఈ విధంగా గ్రామాలు ఎంతో అభివృద్ధిలోకి వచ్చాయి. అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం కూడా అద్భుతంగా అభివృద్ధి చెందింది. వివిధ సామాజిక వర్గాలు కూడా అభివృద్ధిలో ముందజలో ఉన్నాయి.
– గోగులమండ చిన్న కృష్ణమూర్తి, సర్పంచ్, యండగండి
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ జెండా ఆవిష్కరణలు, కేక్ కటింగ్‌లు చేయనున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం దగాతో మోసపోయిన నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన జిల్లా కేంద్రాల్లో శ్రీయువత పోరుశ్రీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ప్రగతి పరవళ్లు
ప్రగతి పరవళ్లు
ప్రగతి పరవళ్లు
Comments
Please login to add a commentAdd a comment