నెత్తుటి ధారలు
హైవేపై
రహదారులు రక్తసిక్తమవుతున్నాయి.. రోజు మార్చి రోజు ప్రమాదాలకు జిల్లాలోని జాతీయ రహదారులు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.. పది రోజుల వ్యవధిలో ఆరుకుపైగా ప్రమాదాలు జరగ్గా, రెండు భారీ ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారుల నుంచి మంత్రుల వరకు మొక్కుబడిగా హడావుడి చేయడం తప్ప శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. బ్లాక్ స్పాట్ల వద్ద జాగ్రత్తలు, సూచిక బోర్డుల ఏర్పాటు, రహదారి స్థితిగతులపై కనీస పర్యవేక్షణ వంటి ప్రాథమిక అంశాలపై కూడా దృష్టి సారించడం లేదు.
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
ప్రమాద ఘంటికలు
● రక్తసిక్తంగా జాతీయ రహదారులు
● పట్టించుకోని ఎన్‌హెచ్, ఆర్‌అండ్‌బీ అధికారులు
● పది రోజుల్లో ఆరుకు పైగా ప్రమాదాలు
● ఏడుగురు దుర్మరణం
● భద్రతా చర్యలు, ముందస్తు జాగ్రత్తలు శూన్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రెండు కీలక జాతీయ రహదారులు ఉన్నాయి. ఎన్‌హెచ్–16, ఎన్‌హెచ్ 216 (ఎ) మీదుగా అత్యధిక రాకపోకలు జరుగుతుంటాయి. ఆయా రహదారుల్లో నెలకు సగటున 20 నుంచి 25 వరకు ప్రమాదాలు జరుగుతుండగా.. 10 మందికిపైనే మృత్యువాతపడుతున్నారు. ఎన్‌హెచ్–216 (ఎ)లో ద్విచక్రవాహనాల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్‌హెచ్–16 మీదుగా రోజుకు 25 వేల వరకు నాలుగు చక్రాలు, ఆపై వాహనాలు, 12 వేల వరకు ఆటోలు, ద్విచక్రవాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఎన్‌హెచ్–216 (ఎ) మీదుగా సగటున 15 వేలకుపైగా నాలుగు చక్రాలు, ఆపై వాహనాలు, 10 వేలకు పైగా ఆటోలు, ద్విచక్రవాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
34 బ్లాక్ స్పాట్లు
ఏలూరు జిల్లాలో తరుచూ ప్రమాదాలు జరిగే, అత్యంత సంక్లిష్టంగా ఉండే 34 ప్రాంతాలను గుర్తించి బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. ఇలా గుర్తించిన ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగు స్థలం నెమ్మదిగా వెళ్లాలని సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలి. అలాగే వాహనాల వేగాన్ని తగ్గించడానికి రంబల్ స్టిప్స్ ఏర్పాటు చేయడం, రేడియం స్టిక్కర్లు, హైవే, పోలీస్ పెట్రోలింగ్ లాంటివి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. అయితే జిల్లాలో ఒక్క చోట కూడా మచ్చుకై నా అలాంటి పరిస్థితి లేదు.
టోల్ వసూళ్లకే పరిమితమవుతూ..
జాతీయ రహదారిపై గతంలో టోల్ వసూలు చేసే కంపెనీలే కొంతమేర రహదారి మరమ్మతులు నిర్వహించేవి. అయితే ఇటీవల కాలంలో టోల్‌ప్లాజాలు కేవలం టోలు వసూలు మినహా మిగతా అంశాలతో సంబంధం లేనివిధంగా పనిచేస్తున్నాయి. గన్నవరం సమీపంలోని పిన్నమనేని సిద్థార్థ నుంచి కలపర్రు టోల్‌గేటు వరకు ఒక సంస్థ, పాత టోల్‌గేటు నుంచి గుండుగొలను వరకు మరో కంపెనీకి మరమ్మతులు, ఇతర రహదారుల నిర్వహణ బాధ్యతను నేషనల్ హైవే అథారిటీ కట్టపెట్టింది. అయినా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కరువయ్యింది. రహదారులపై పలుచోట్ల గోతులు, ప్రమాదకర మలుపు ఉండటం, అలాంటి చోట్ల కనీసం సూచిక బోర్డులు కూడా లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
అతి వేగం.. ప్రమాదాలకు కారణం
రాత్రిళ్లు, వేకువజామున ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయి. 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు స్పీడ్ లిమిట్ కాగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాయి.
పచ్చదనం కరువు
డివైడర్లల్లో తప్పనిసరిగా మొక్కలు పెంచాలి. మొక్కలు దట్టంగా పెంచడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్ ఇబ్బందులు తగ్గడంతో పాటు వాహనాల నుంచి వెలువడే కార్బన్ డయాకై ్సడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను ఇస్తాయని గన్నేరు, ఇతర మొక్కలు పెంచాల్సి ఉంది. కలపర్రు నుంచి గుండుగొలను వరకు ఎక్కడా పచ్చదనం కనిపించని పరిస్థితి.
ప్రమాదాలు ఇక్కడే ఎక్కువగా..
దెందులూరు చెక్‌పోస్టు నుంచి ఆశ్రం, గుండుగొలను నుంచి సత్యనారాయణపురం, ఆశ్రం జంక్షన్, నోవా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ప్రమాదాలు కూడా ఎక్కువగా ఇక్కడే జరుగుతున్నాయి.
సమన్వయ లోపం
నేషనల్ హైవే అథారిటీ, ఆర్‌అండ్‌బీ అధికారుల మధ్య సమన్వయ లోపం మరో ప్రధాన సమస్య. అలాగే వరుస ప్రమాదాలు జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా స్పందించడం లేదు. కనీసం పోలీస్ శాఖపరంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా పరిస్థితి కొంత మెరుగవుతుంది.
న్యూస్‌రీల్
అన్ని చర్యలూ తీసుకుంటాం
రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. వేగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవడానికి వీలుగా నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడుతున్నాం. బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తాం
– షేక్ కరీమ్,
ఉప రవాణా కమిషనర్, ఏలూరు
ఎన్‌హెచ్ 16
హనుమాన్ జంక్షన్ నుంచి భీమడోలు మండలం వరకు.. రోజుకు సగటున
35,000
పైగా వాహనాల రాకపోకలు
ఎన్‌హెచ్ 216 (ఏ)
గుండుగొలను జంక్షన్ నుంచి సిద్ధాంతం వరకు..
రోజుకు సగటున
25,000
పైగా వాహనాల రాకపోకలు
నెత్తుటి ధారలు
నెత్తుటి ధారలు
నెత్తుటి ధారలు
నెత్తుటి ధారలు
నెత్తుటి ధారలు
నెత్తుటి ధారలు
నెత్తుటి ధారలు
నెత్తుటి ధారలు
నెత్తుటి ధారలు
నెత్తుటి ధారలు
నెత్తుటి ధారలు
Comments
Please login to add a commentAdd a comment