‘ఎన్‌ఎల్‌ఆర్–3238’తో మంచి దిగుబడులు
ఆకివీడు: కొత్త వరి వంగడం ఎన్‌ఎల్‌ఆర్ 3238 వంగడం దాళ్వాలో అద్భుత ఫలితాల్ని ఇవ్వనుందని జిల్లా వ్యవసాయాధికారి జెడ్.వెంకటేశ్వర్లు చెప్పారు. మండలంలోని కుప్పనపూడిలో రైతు నంద్యాల చల్లారావు పొలంలో వరిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి ఒక మినీ కిట్ చొప్పున నూతన వంగడాల్ని జిల్లా అంతటా పంపిణీ చేసినట్లు చెప్పారు. మధ్యస్థ సన్నాలుగా ఉన్న వీటిని తెలంగాణా సన్నాలను పోలి ఉంటాయన్నారు. గర్భిణులకు ఈ బియ్యం మంచివన్నా రు. 50 బస్తాలకు పైబడి దిగుబడి వస్తుందని చెప్పారు. ఇంతవరకూ సాగులో ఏ విధమైన తెగుళ్లు లేవని.. పల్లపు ప్రాంతాల్లో 45–50 బస్తాలు, మెట్ట ప్రాంతంలో 50–60 బస్తాల పైగా దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత దాళ్వా సాగు ఆశాజనకంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ కె.శ్రీనివాసరావు, ఏఓ ఎమ్మార్పీ ప్రియాంక, రైతు నంద్యాల చల్లారావు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓగా గీతాబాయి బాధ్యతల స్వీకరణ
భీమవరం(ప్రకాశంచౌక్): డీఎంహెచ్‌ఓగా డాక్టర్ జి.గీతాబాయి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతవర కూ డీఎంహెచ్‌ఓగా పనిచేసిన డాక్టర్ డి.మహేశ్వరరావు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడంతో ఈ ఖాళీ ఏర్పడింది. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ భానునాయక్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రెగ్యులర్ డీఎంహెచ్ఘోగా గీతాబాయికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అట్టడుగు వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.
వర్గీకరణను నిరసిస్తూ ఆందోళన
భీమవరం: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం అంబేడ్కర్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల సంఘాల నాయకులు కోనా జోసెఫ్, చీకటిమిల్లి మంగరాజు, గంటా సుందర్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. వర్గీకరణ వల్ల మాల, మాదిగల్లో విభేదాలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మీసాల జైరాజ్, కేసీ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 20న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. ఽకార్యక్రమంలో జేఏసీ నాయకులు ఈది రవికుమార్, బేతాల కమలాకర్, గాతల సందీప్, గొల్ల రాజ్ కుమార్, అంబటి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వాల్యుయేషన్‌లో మినహాయింపునివ్వాలి
భీమవరం: పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీల విషయంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు, గర్భిణులు, బాలింతలు, 60 ఏళ్ల వయస్సు పైబడిన ఉపాధ్యాయులకు డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ నాయకులు జిల్లా విద్యాశాఖాధికారిని కోరారు. మంగళవారం డీఈవో నారాయణను కలిసి వినతిపత్రం అందచేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కొందరికి వాల్యుయేషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు.
‘ఎన్‌ఎల్‌ఆర్–3238’తో మంచి దిగుబడులు
Comments
Please login to add a commentAdd a comment