
విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి
నూజివీడు: పట్టణంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయం మలుపులో నిర్మాణంలో ఉన్న నూతన బిల్డింగ్‌లో టైల్స్ వేసే పనికి వెళ్లిన 17 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక అజరయ్యపేటకు చెందిన చిట్లూరి ప్రవీణ్ (17) తొమ్మిదో తరగతి వరకు చదువుకొని ఆ తరువాత తన తండ్రికి పనుల్లో సాయంగా వంట పనికి వెళ్తుంటాడు. వంట పని లేనిప్పుడు కూలి పనులకు వెళ్తూ ఉంటాడు. దీనిలో భాగంగా నూతన బిల్డింగ్‌లో టైల్స్ వేసే పనికి మేసీ్త్రతో పాటు వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా ఊదయం 10 గంటల సమయంలో సున్నం బస్తాను తీసుకుని అక్కడే ఉన్న ఐరన్ గ్రిల్స్‌పై కాలు వేయగానే గిలాగిలా కొట్టుకొంటూ కిందపడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న మేసీ్త్ర లాగు శ్రీను బాలుడిని పట్టుకోగా అతను పెద్దగా కేకలు వేస్తూ గిలాగిలా కొట్టుకుంటున్నాడు. ఇదే సమయంలో సమీపంలో ఉన్న ఆటో డ్రైవర్ అతను కేకలు విని చూసి పరిగెత్తుకొని వచ్చి కరెంటు బోర్డులో ఉన్న విద్యుత్ తీగను తప్పించాడు. ఈ తీగకు ఉన్న అతుకులు తొలగి ఐరన్ గ్రిల్స్‌కు ఆనడం వల్ల గ్రీల్స్‌కు కరెంటు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. అనంతరం లాగు శ్రీనుని, ప్రవీణ్‌లను సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. షాక్‌కు గురైన మేసీ్త్ర లాగు శ్రీను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో అజరయ్యపేటలో తీవ్ర విషాదం నెలకొంది.