
పేరుకే స్టాక్ పాయింట్
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
అడ్డగోలుగా వసూళ్లు
ఇసుక ఉచితమని, లో డింగ్ చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. ఏ ర్యాంపు వద్దకు వెళ్లినా లోడింగ్ చార్జీలతో పాటు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని వినియోగదారులతో పాటు కిరాయిలు రాక లారీ యజమానులు నష్టపోతున్నాం. అధికారులు స్పందించి అదనపు వసూళ్లను ఆపాలి.
– రావూరి రాజా,
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు
సాక్షి, భీమవరం: జిల్లాలోని ఆరు ఓపెన్ రీచ్‌లు, ఐదు డిసిల్టేషన్ పాయింట్లు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వెళ్లడంతో వాటిని మూసివేశారు. ఇసుక కోసం తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని తీపర్రు, పెండ్యాల, పందలపర్రు, గోపాలపురం, తదితర ర్యాంపులకు వెళ్లాల్సి వస్తోంది. స్థానిక అవసరాల నిమిత్తం ఆచంట, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, ఉండి నియోజకవర్గ కేంద్రాల్లో స్టాక్ పాయింట్ల ఏర్పాటుకు జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించింది. తీపర్రు–2 ర్యాంపు నుంచి ఇసుకను తరలించి స్టాకు యార్డుల ద్వారా అమ్మకాలు చేసే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. ఆచంట స్టాక్ పాయింట్ వద్ద టన్ను రూ.295, పాలకొల్లులో రూ.320, తాడేపల్లిగూడెంలో రూ.300, తణుకులో రూ.215, నరసాపురంలో రూ.370, ఉండిలో రూ.440గా ధర నిర్ణయించారు. ఆయా స్టాకు పాయింట్ల వద్ద మొత్తం 900 టన్నుల ఇసుక అందుబాటులో ఉంచామని, అవసరమైన వారు తీసుకువెళ్లాలని ఫిబ్రవరి మొదటి వారంలో అధికారులు ప్రకటించారు.
సేల్స్ మొదలు కాలేదు
వినియోగదారులు తమ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదుచేసుకుని రిజిస్ట్రేషన్ రశీదును స్టాక్ పాయింట్ వద్ద చూపించి ఇసుక పొందవచ్చని, లేదా నేరుగా స్టాక్ పాయింట్ వద్దకు ఆధార్ కార్డును చూపించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని సూచించారు. పాయింట్ వద్ద రిజిస్ట్రేషన్ చేయిస్తే అక్కడి ఇన్‌చార్జి డిజిటల్ పేమెంట్ చేయించుకుని ఇసుక సరఫరా చేసేలా ఏర్పాటుచేశారు. ఆయా స్టాక్ పాయింట్ల వద్ద ఉండే ఇన్‌చార్జిల నంబర్లను అధికారులు విడుదల చేశారు. వీటిలో కొన్ని పనిచేస్తుండగా మరికొన్ని స్విచ్ఛాఫ్ చేసి ఉన్నాయి. పాలకొల్లు, నరసాపురం, తణుకు, ఉండి కౌంటర్ల ఇన్‌చార్జిలకు ఫోన్లు చేసి ఇసుక అమ్మకాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా వారి నుంచి అమ్మకాలు ఇంకా మొదలు కాలేదన్న సమాధానం వచ్చింది. అమ్మకాలు ప్రారంభించకపోవడంపై జిల్లా గనులు, భూగర్భశాఖ ఏడీని ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేయగా కనెక్ట్ అవ్వలేదు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
ఉదాహరణకు ఐదు యూనిట్ల లారీని నింపేందుకు దాదాపు 20 టన్నుల ఇసుక అవసరమవుతుంది. ప్రస్తుతం ర్యాంపు వద్ద నుంచి ఉండి ప్రాంతానికి లారీకి సుమారు రూ.17 వేల వరకు వసూలు చేస్తున్నారు. స్థానికంగా ఏర్పాటుచేసిన స్టాక్ పాయింట్‌ను వినియోగంలోకి తెస్తే ఇసుక లోడింగ్‌కు రూ.8,800, రవాణా నిమిత్తం రూ.3 వేలు వెచ్చించినా రూ.11,800లకే ఇసుక లభ్యమవుతుంది. వినియోగదారులకు రూ.5 వేల వరకు ఆదా అవుతుందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ స్టాకు పా యింట్లతో ర్యాంపు నిర్వాహకుల దోపిడీకి ఆస్కారం ఉండదు. తక్కువ ధరకే జిల్లా వాసులకు ఇసుక లభ్యమవుతుంది. జిల్లాలో ఏర్పాటుచేసిన స్టాకు పాయింట్లు తెరిచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
న్యూస్‌రీల్
ఇసుక.. మస్కా
టన్ను ఇసుక ఇచ్చింది లేదు
జిల్లాలో అలంకారప్రాయంగా స్టాక్ యార్డులు
ఏర్పాటుచేసి రెండు నెలలు
ఇంకా మొదలుకాని ఇసుక విక్రయాలు
ర్యాంపుల వద్ద లారీకి రూ.5 వేల దోపిడీ
జిల్లావాసులపై రోజుకు రూ.30 లక్షల వరకు అదనపు భారం
రూ. లక్షల్లో భారం
పొరుగు జిల్లాల్లోని ఏ ర్యాంపు వద్దకు వెళ్లినా లోడింగ్ చార్జీలతో పాటు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అదనంగా చెల్లిస్తేనే ఇసుక లోడింగ్ చేస్తున్నట్టు లారీ యజమానులు చెబుతున్నారు. అదనపు వసూళ్ల రూపంలో పాలకులు, నాయకుల జేబుల్లోకి వెళుతున్న వాటాల మొత్తం భారాన్ని జిల్లాలోని వినియోగదారులు భరించాల్సి వస్తోందంటున్నారు. ఆయా ర్యాంపుల నుంచి జిల్లాకు రోజుకు 500 నుంచి 600 లారీల ఇసుక రవాణా జరుగుతుండగా ఈ మేరకు స్థానిక వినియోగదారులపై రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు భారం పడుతోందని అంచనా.
మూసి ఉన్న ఈ కౌంటర్‌ను గమనించారా? ఉండి నియోజకవర్గ ప్రజల ఇసుక అవసరాలు తీర్చే నిమిత్తం కొలమూరులోని ప్రైవేట్ స్థలంలో మైనింగ్ అధికారులు ఏర్పాటుచేసిన స్టాక్ యార్డ్‌లోని కౌంటర్ ఇది. వినియోగదారులకు ఇక్కడ ప్రభుత్వ నిర్ణీత ధరకే ఇసుకను విక్రయించనున్నట్టు ప్రకటించారు. స్టాక్ పాయింట్ నిర్వహణ బాధ్యతల్ని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. స్టాక్ యార్డు ఏర్పాటుచేసి రెండు నెలలు దాటినా ఇప్పటికీ ఈ కౌంటర్‌ను ఓపెన్ చేసి వినియోగదారులకు లారీ ఇసుక విక్రయించిన దాఖలాలు లేవు.

పేరుకే స్టాక్ పాయింట్

పేరుకే స్టాక్ పాయింట్

పేరుకే స్టాక్ పాయింట్