
జూనియర్ లెక్చరర్ల సంఘ కార్యవర్గం ఎన్నిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఏలూరు జిల్లా శాఖకు నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంఘ అధ్యక్షుడిగా జి.భక్త హనుమాన్, కార్యదర్శిగా వి. శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు సంఘ ఉపాధ్యక్షుడిగా ఎస్‌కే ఖాసింపీర, సంయుక్త కార్యదర్శిగా కేకేఎన్ జనార్థన రావు, కోశాధికారిగా కే. సమత తదితరులను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా జి.సందీప్, పరిశీలకునిగా అయినపర్తి మురళీకృష్ణ వ్యవహరించారు.