
మహోదయం.. ఏసు పునరుత్థానం
కాళ్ల : జువ్వలపాలెంలో సమాధుల తోటలో ప్రార్థనలు చేస్తున్న దృశ్యం
పెంటపాడు: తాడేపల్లిగూడెం పాతూరులోని సమాధుల తోటల్లో కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేస్తున్న విశ్వాసులు
కరుణామయుడు ఏసు పునరుత్థానానికి చిహ్నంగా క్రైస్తవులు ఈస్టర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సమాధుల తోటలను ప్రత్యేకంగా అలంకరించి తమ కుటుంబసభ్యుల కోసం వేకువజామున కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిల్లో విశేషంగా అలంకరించిన వేదికలపై క్రీస్తును ఆహ్వానిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. క్షమ, కరుణ, సహనానికి ప్రతీక ఈస్టర్ అని మత పెద్దలు ఉద్బోధించారు. – సాక్షి నెట్‌వర్క్

మహోదయం.. ఏసు పునరుత్థానం