
శశి విద్యార్థుల విజయభేరి
తణుకు అర్బన్: పదో తగరతి పరీక్షా ఫలితాల్లో తణుకు శశి ఇంగ్లీషు మీడియం హైస్కూల్ విద్యార్థులు అత్యున్నత మార్కులతోపాటు నూరుశాతం ఉత్తీర్ణత సాధించినట్లు సంస్థ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తెలిపారు. విద్యార్థుల్లో తోరం సుప్రియ 595 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, పైడి రసజ్ఞ, సత్తి లహరి, గాదిరాజు జోషిత 594, నాయుడు లక్ష్మీ వెంకట సుజిత్ చౌదరి 593, సావిరిగాన జాహ్నవి 592, అల్లాడబోయిన మోనికసాయి 591, మండేలా మాధుర్య రమాసాయి, సైపురెడ్డి సత్యశ్రీ, బొల్లా లక్ష్మీ దీపక్ చౌదరి, కాపకాయల సాయి పవన్ గణేష్, పైడి మణి మాలతి, కంకిపాటి ప్రేస్‌పాల్, మద్దల మణికంఠ పవన్‌సాయి, పాటే పద్మశ్రీ, సుంకవల్లి హర్షిత చౌదరి 590 మార్కులు చొప్పున సాధించినట్లు వివరించారు. విద్యార్థులను సంస్థ వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా క్రాంతిసుధ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాదెళ్ల ప్రసాద్, తణుకు శశి క్యాంపస్ ఇన్‌చార్జ్ నిమ్మగడ్డ రాజేంద్రప్రసాద్ అభినందించారు.