
ధాన్యం కొనుగోలు వేగిరపర్చాలి
పెంటపాడు: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని జిల్లా పౌరసరఫరాల మేనేజర్ టి.శివరామప్రసాద్ ఆదేశించారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. సేవా కేంద్రాల్లో ట్రక్‌షీ ట్, సంచుల వివరాలు, ట్రక్కుషీట్, ట్రాన్స్‌ఫర్ ఆ ర్డర్, రైతులు ఆరబోసిన ధాన్యం తేమశాత, మిల్లర్ల వద్ద మిల్లర్లు వద్ద పనితీరు పరిశీలించారు. మిల్లర్లకు ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా సంచులను రైతు సేవా కేంద్రాలకు అందజేయాలన్నారు. వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.479 కోట్ల విలువైన 2,07,721 టన్నుల ధాన్యాన్ని 21,920 మంది రైతుల వద్ద నుంచి సేకరించామన్నారు. ఏడీఏ పి.మురళీకృష్ణ, ఇన్‌చార్జి తహసీల్దార్ సీతారత్నం, ఏఓ సారథి, కో–ఆపరేటివ్ అధికారి రవికుమార్ ఆయన వెంట ఉన్నారు.