
‘సాక్షి’పై దాడి అమానుషం
వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ ఇన్‌చార్జి సునీల్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేయటం, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయంలో కంప్యూటర్లు ధ్వంసం చేయటం సరికాదని వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ... మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, మంచి చేయండి, ప్రజలకు చేరువ కావటానికి ప్రయత్నం చేయండి, పత్రికా స్వేచ్ఛను ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో ఉంటూ బెదిరింపులు, అనుచరులతో దాడులు చేయటం ఏమాత్రం సమర్థనీయం కాదు అని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, అధికారం తమకు వస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. దౌర్జ న్యాలు, అరాచకాలు, లిక్కర్ మాఫియా, కోడిపందాలు, జూదాలు తప్ప ఏమున్నాయని సునీల్ ప్రశ్నించారు.