
విద్యార్థులకు గేలం
శురకవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
విస్తృతంగా తనిఖీలు
పట్టణంలోని హోటళ్లు, లాడ్జీలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఆయా వ్యక్తులతోపాటు లాడ్జి యాజమాన్యాలపై కూడా కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే లాడ్జీల్లో రూమ్‌లు తీసుకుంటున్న వారి వివరాలు ఆధార్ కార్డుతో సహా నమోదు చేసి ప్రతిరోజూ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశాం.
– జి.కాళీచరణ్, టూటౌన్ సీఐ, భీమవరం
యువత పెడతోవ
● భీమవరంలోని లాడ్జిల్లో పేకాట, బెట్టింగ్, వ్యభిచార కార్యకలాపాలు
● పట్టణంలో 35 వరకు లాడ్జీలు, హోటళ్లు
● గుట్టుగా సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు
● విద్యార్థులే లక్ష్యంగా నిర్వాహకుల గేలం
● గంటల లెక్కన అద్దె వసూళ్లు
సాక్షి, భీమవరం: జిల్లా కేంద్రమైన భీమవరం విద్య, వైద్యం, ఆక్వా హబ్‌గా పేరొందింది. వ్యాపార లావాదేవీలు, ఇతర పనుల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం పట్టణంలో వన్‌టౌన్, టూటౌన్ పరిధిలో 35 వరకు హోటళ్లు, లాడ్జీలు ఉన్నాయి. వీటిలోని పలు లాడ్జీలు పేకాట, క్రికెట్ బెట్టింగ్, వ్యభిచారం తదితర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. అడపాదడపా పోలీసుల తనిఖీల్లో ఒకటి అరా సంఘటనలు వెలుగు చూస్తుండగా గుట్టుగా సాగిపోతున్న వ్యవహారాలు ఎన్నో. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో భీమవరం, పరిసరాలకు చెందిన బుకీలు పట్టణంలోని లాడ్జీలు కేంద్రంగానే బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని పలు లాడ్జీలు పేకాటకు కేరాఫ్‌గా మారాయని సమాచారం.
అదనంగా వసూలు చేస్తూ.. సాధారణంగా ఎవరైనా లాడ్జిలోని రూం తీసుకునే సమయంలో వారి ఆధార్ కార్డు, సెల్‌ఫోన్ నంబర్, ఎన్ని రోజులు ఉంటారు? తదితర వివరాలను లాడ్జి నిర్వాహకులు రిజిస్టర్‌లో నమోదు చేయాలి. ఇతర ప్రాంతాలకు చెందిన వారైతే ఏ పని నిమిత్తం వారు పట్టణానికి వచ్చారు? ఎన్ని రోజులు ఉంటారనే వివరాలను కూడా రిజిస్టర్‌లో నమోదుచేయాలి. ప్రతిరోజూ ఆ వివరాలను పోలీస్‌స్టేషన్‌లో అందజేయాలి. కాగా చాలాచోట్ల ఇవేమీ అమలుకావడం లేదు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు ముందుగానే లాడ్జి నిర్వాహకులు, సిబ్బందితో మాట్లాడుకోవడం ద్వారా వ్యక్తిగత వివరాలేమి ఇవ్వకుండానే రూముల్లో దిగి తమ పని కానిస్తున్నారు. సాధారణంగా రూమ్ అద్దెలతో పోలిస్తే వీరి నుంచి నిర్వాహకులు రెండు మూడింతలు ఎక్కువగా వసూలు చేస్తూ వారికి సహకరిస్తున్నారు. కొంతమంది పోలీసు సిబ్బందికి నెలవారీగా మామూళ్లు ముట్టచెప్పుతూ ఎప్పుడైనా పోలీసులు తనిఖీలకు వచ్చే సమయంలో వారి ద్వారా ముందుగానే సమాచారం తెలుసుకుని జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది.
న్యూస్‌రీల్
విద్యాపరంగా పట్టణం పేరొందింది. దూర ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి విద్యాభ్యాసం సాగిస్తున్నారు. ప్రేమ కార్యకలాపాలు సాగించేందుకు ఏకాంతం కోరుకునే యువ జంటలు లాడ్జిలను ఆశ్రయిస్తున్నారు. ఫలానా లాడ్జి అయితే సేఫ్ అని, స్టూడెంట్స్‌కు గంటల లెక్కన మాత్రమే అమౌంట్ తీసుకుంటారని లోపాయికారీగా పబ్లిసిటీ చేయించుకోవడం ద్వారా కొన్ని లాడ్జ్జీలు యువతకు గేలం వేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఒక లాడ్జిలో పోలీసులు సోదాలు చేయగా తొమ్మిది జంటలు దొరకగా అందరూ విద్యార్థులే కావడం గమనార్హం. లాడ్జి నిర్వాహకులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు తరచూ తనిఖీలు చేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

విద్యార్థులకు గేలం

విద్యార్థులకు గేలం

విద్యార్థులకు గేలం