
సొంత భవనం సమకూరేదెప్పుడో?
భీమవరం (ప్రకాశం చౌక్) : నూతన పశ్చిమగోదా వరి జిల్లా కలెక్టరేట్‌కు సొంత భవనం సమకూర్చడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. జిల్లా ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా అద్దె భవనంలోనే కలెక్టరేట్ సాగుతోంది. సొంత భవనం ఏర్పాటుకు మార్కెట్ యార్డ్ ప్రాంతం అనుకూలంగా ఉ న్నా అడుగు ముందుకు వేయడం లేదు. ఇటీవల తణుకు, పెనుగొండలో పర్యటనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టరేట్ భవనం మాటెత్తలేదు. అలాగే ఉన్నతాధికారులతో కనీసం సమీక్ష కూడా జరపలేదు.
గత ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల పునర్విభజనలో భా గంగా పశ్చిమగోదావరి జిల్లాను పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలుగా ఏర్పాటుచేశారు. భీమవరంలో కలెక్టరేట్‌ను అద్దె భవనంలో ఏర్పాటుచేసినా సొంత భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. భీమవరం మార్కెట్ యార్డ్‌లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం జీఓ కూడా జారీ చేశారు. దీంతో అప్పటి కలెక్టర్ ప్రశాంతి ఈ దిశగా చర్యలు కూడా తీసుకున్నారు.
ప్రభుత్వం మారడంతో..
మార్కెట్ యార్డ్‌లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్న తరుణంలో సా ర్వత్రిక ఎన్నికలు వచ్చాయి. తర్వాత కూటమి ప్ర భుత్వం అధికారం చేపట్టడంతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అంశం అటకెక్కింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ అమలును పట్టించుకోలేదు. సొంత భవన నిర్మాణంపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మార్కెట్ యార్డ్ అనుకూలం
భీమవరం మార్కెట్ యార్డ్‌లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఏర్పాటు చేయడం అనుకూలంగా ఉంటుందని ప్రజలు అంటున్నారు. దీనిద్వారా పట్టణంలో ట్రా ఫిక్ సమస్య తగ్గుతుందని, ఉండి, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు ప్రాంత ప్రజల రాకపోకలకు వీ లుందని చెబుతున్నారు. ధర్నాలు, నిరసనల సమయంలోనూ పట్టణంలో ఇబ్బందులు తలెత్తవని అంటున్నారు. అలాగే ఎక్కువగా రోడ్ల నిర్మాణం అవసరం ఉండదని చెబుతున్నారు.
కలెక్టరేట్ ఏర్పడి మూడేళ్లు
అద్దె భవనంలోనే నిర్వహణ
సొంత భవన నిర్మాణంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
గత ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌కు చర్యలు
మార్కెట్ యార్డ్‌లో మేలు
భీమవరం మార్కెట్ యార్డ్ లో కలెక్టరేట్ ఏర్పాటు చే యడం అన్నింటికీ అనుకూలం. ఇప్పటికే అక్కడ స్థలం ఉండటం వల్ల ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణాలు వేగంగా పూర్తవుతాయి. ప్రజలకు రోడ్డు, రైలు మార్గాలు కూడా ఉండటంతో రాకపోకలు సులభం.
– చిగురుపాటి సందీప్, భీమవరం
ప్రయాణ ఇక్కట్లు లేకుండా..
మార్కెట్ యార్డ్‌లో కలెక్టరేట్ కు సొంత భవనం ఏర్పాటు తో ప్రయాణ ఇక్కట్లు ఉండ వు. ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు నుంచి బస్సులు, ఆటోల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్‌కు వెళ్లేందుకు మహిళలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు.
– వి.శ్రీను, వీరవాసరం

సొంత భవనం సమకూరేదెప్పుడో?

సొంత భవనం సమకూరేదెప్పుడో?