
ప్రశాంతంగా ‘గురుకుల’ పరీక్షలు
ఏలూరు (టూటౌన్) : మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి (2025–26) ఆదివారం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్‌వీ నాగరాణి తెలిపారు. ఏలూరు బాలికల గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏలూరులో పాఠశాలలో 80 సీట్లకు 147 నుంచి విద్యార్థులు దరఖాస్తు చేయగా 116 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. జిల్లా సమన్వ యకర్త, బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సి పాల్ లక్ష్మి ఉన్నారు.
పాలిసెట్‌కు పటిష్ట ఏర్పాట్లు
పెంటపాడు: జిల్లాలోని నాలుగు పట్టణాల్లో ఈనెల 30న జరిగే పాలిసెట్–2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డి.ఫణీంద్రప్రసాద్ ప్రకటనలో తెలిపారు. తాడేపల్లిగూడెం, తణు కు, భీమవరం, నరసాపురంలో కేంద్రాలు ఏ ర్పాటుచేశామని, 7,254 మంది పరీక్షలకు హా జరుకానున్నారన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే పరీక్షకు గంట ముందు హాజరుకావాలన్నారు. హాల్‌టికెట్ రాని వారు పరీక్షా కేంద్రానికి వెళ్లి పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 9121602009, 9490104336 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఆప్కాస్ రద్దు యోచన తగదు
ఏలూరు (టూటౌన్): మున్సిపల్ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించాలని, ఆప్కాస్ రద్దు ఆ లోచన విరమించుకుని, ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డి మాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో ఏ లూరులో జరుగుతున్న శిక్షణ తరగతులకు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లు రద్దు కోరుతూ మే 20న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు బి.బాలరాజు, ప్రధాన కార్యదర్శి ఎ.జానుబాబు, జంగారెడ్డిగూడెం నగర అధ్యక్షుడు ఆర్.నాగరాజు, నగర అధ్యక్షులు లావేటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా జయలక్ష్మి
ఉంగుటూరు: వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉంగుటూరుకి చెందిన మంద జయలక్ష్మి నియమితులయ్యారు. ఆమె మండల మహిళా విభాగం అధ్యక్షురాలిగా, జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు రాష్ట్ర పదవి వరించింది. మండల నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ తనకు రాష్ట్ర పదవి కేటాయించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, సహకరించిన మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబా బుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి నిరంతం కృషి చేస్తానని, మహిళల్లో చైత న్యం తీసుకువస్తానని జయలక్ష్మి అన్నారు.
ఏలూరు రైల్వేస్టేషన్‌లో తనిఖీలు
ఏలూరు టౌన్ : అసాంఘిక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు, ముందస్తు చర్యల్లో భాగంగా ఏలూరు, పవర్‌పేట స్టేషన్లలో రైల్వే ఎస్సై పి.సైమన్ ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఏలూరు స్టేషన్‌లోని ప్లాట్ ఫామ్స్, వెయిటింగ్ హాల్స్, బుకింగ్ కార్యాలయం, రిజర్వేషన్ కౌంటర్లు, పార్సిల్ కేంద్రాల్లో ముమ్మరంగా సోదాలు చేశారు. ఆర్‌పీఎఫ్, రైల్వే పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రైల్వేస్ డీఎస్పీ జి.రత్నరాజు, సీఐ ఎంవీ దుర్గారావు సిబ్బందికి సూచించారు. అనుమానిత వ్యక్తులపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలని ఆదేశించారు.

ప్రశాంతంగా ‘గురుకుల’ పరీక్షలు

ప్రశాంతంగా ‘గురుకుల’ పరీక్షలు